‘యూనివర్స్ బాస్’ విధ్వంసకర ఇన్నింగ్స్.. పంజాబ్ భారీ స్కోర్..

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో రాయల్స్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌లోనే పంజాబ్.. మనదీప్(0) వికెట్‌ను కోల్పోయినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ రాహుల్(46), క్రిస్ గేల్(99) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రతీ ఓవర్‌కు 10 పరుగులను […]

యూనివర్స్ బాస్ విధ్వంసకర ఇన్నింగ్స్.. పంజాబ్ భారీ స్కోర్..

Updated on: Oct 30, 2020 | 9:29 PM

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో రాయల్స్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

మొదటి ఓవర్‌లోనే పంజాబ్.. మనదీప్(0) వికెట్‌ను కోల్పోయినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ రాహుల్(46), క్రిస్ గేల్(99) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రతీ ఓవర్‌కు 10 పరుగులను రాబడుతూ.. స్కోర్ బోర్డును వేగంగా కదిలించారు. అలాగే వన్ డౌన్‌లో వచ్చిన పూరన్(22) కూడా మెరుపులు మెరిపించడంతో పంజాబ్ 185 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది. ఇక రాయల్స్ బౌలర్లలో ఆర్చర్, స్టోక్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు.