భారత్‌లో క్రికెట్ ఓ మతంలా మారింది.. పేరుకు జాతీయ క్రీడ హాకీనే అయినా క్రికెట్‌కు ఉన్న క్రేజు మోజు మరే ఆటకు లేదిక్కడ! క్రికెట్ అంటే చెవే కాదు ముక్కు చెవులు కూడా కోసుకునే వారు చాలా మందే ఉన్నారు.. ఒకప్పుడు అర్బన్‌లో…అదీ కొన్ని చోట్లనే పరిమితమైన క్రికెట్ ఇప్పుడు రూరల్ ఏరియాల్లోనూ పాకింది.. చివరాఖరికి డ్రాయింగ్ రూమ్ నుంచి కిచెన్ రూమ్‌లోకి కూడా చొరపడింది.. ఇక క్రికెట్ సీజన్ వస్తే చెప్పేదేముంది.. అన్ని పనులు మానేసుకుని టీవీల ముందు అతుక్కుపోతారు.. ఐపీఎల్‌లాంటి టోర్నమెంట్లప్పుడు ఆ జోషే వేరుగా ఉంటుంది.. ఉరుకులు పరుగుల జీవితంలో క్రికెట్‌ను కూడా షార్ట్‌కట్ చేసుకుని ఆనందపడటం అలవాటు చేసుకున్నాం.. టీ-20లకు ఆదరణ పెరగడానికి ఇదో కారణం.. ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ మూన్నాలుగు గంటల్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి.. అందులోనూ ప్రపంచ మేటి క్రికెటర్లలందరూ పార్టిసిపేట్ చేసే అరుదైన టోర్నీ ఇది. ఈసారి ప్రేక్షకులు లేక స్టేడియంలు ఖాళీగా బోసిపోయి కనిపిస్తున్నా.. ఉత్సాహానికేమీ తక్కువ లేదు.. అదే ఉరకలెత్తే ఉత్సాహం.. అదే ఉద్వేగం… అదే ఉత్కంఠ.. బౌండరీలకు, సిక్సర్లకు కేరింతలు, వికెట్ల పడుతున్నప్పుడు హర్షధ్వానాలు.. చీర్‌గాళ్స్ లేకపోవచ్చు కానీ మోర్ ఫన్నయితే కచ్చితంగా ఉంటుంది..
క్రికెట్ మజాను ఆస్వాదించక చాన్నాళ్లయింది.. కరోనా కారణంగా అన్ని క్రికెట్ సిరీస్‌లు రద్దయ్యాయి.. ఎంతకాలం ఇలా ఎంజాయ్‌మెంట్ లేకుండా ఉంటాం? అందుకే కాసింత రిస్క్ అయినా … వ్యవప్రయాసాలు ఎక్కువే అయినా ఐపీఎల్‌ను నిర్వహించడానికే బీసీసీఐ మొగ్గు చూపింది. క్రికెట్ అభిమానులకు ముందస్తు దసరా సరదాను అందిస్తోంది.. ఐపీఎల్ జట్లు కూడా కసి మీదున్నాయి.. ఏదో కాలక్షేపం కోసమో కాసుల కోసమో కాకుండా కప్పు కొట్టాలనే లక్ష్యంతోనే ఎడారి దేశంలో అడుగుపెట్టాయి. అయిదో కప్పు కోసం ముంబాయి ఆరాటపడుతుంటే.. నాలుగో కప్ గెలిచి తీరాలనే పట్టుదలతో చెన్నై ఉంది.. హైదరాబాద్, కోల్‌కతా, రాజస్తాన్‌లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.. ఇక ఇప్పటి వరకు టైటిల్‌ను గెల్చుకోని బెంగళూరు ఆ లోటును తీర్చుకోవాలనుకుంటోంది..
సంధ్య చీకట్లు అలుముకున్న ఉత్తరక్షణంలోనే అభిమానులు టీవీల ముందుకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.. ఇవాళ్టి మ్యాచ్ మామూలుగా ఉండదు.. లాస్ట్ సీజన్‌లో ఫైనలిస్టు జట్లయిన ముంబాయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ ఆరంభ మ్యాచ్‌లో తలపడటం అభిమానులకే పండుగే మరి! ఇప్పటి వరకు ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు 28 సార్లు పోటీపడ్డాయి.. ముంబాయి 17 మ్యాచుల్లో విజయం సాధిస్తే చెన్నై 11 మ్యాచుల్లో గెలుపొందింది. ఈసారి కూడా రోహిత్‌శర్మ నాయకత్వంలోని ముంబాయ్ ఇండియన్స్ రెట్టించిన ఉత్సాహంతో బరిలో దిగుతోంది. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ చూసి చాలా కాలం అయ్యింది కాబట్టి అభిమానులు ఆ సీన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. చెన్నై సూపర్ కింగ్స్‌లో క్రౌడ్ పుల్లర్ ఎవరనే దానికి ధోనీ తప్ప వేరే ఆప్షన్లు ఉండవు.. ఇప్పుడు అందరి దృష్టి ధోనీపైనే ఉంది..
ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ (కెప్టెన్), దిగ్విజయ్ దేశ్‌ముఖ్, ఆదిత్య తారే, సౌరభ్ తివారి, జస్‌ప్రీత్ బుమ్రా, ధవల్ కులకర్ణి, జయంత్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చహర్, హార్దిక్ పాండ్యా, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, మొహసిన్ ఖాన్, బల్వంత్‌రాయ్ సింగ్, అనుకూల్ రాయ్, ఇషాన్ కిషన్ (ఇండియన్ ప్లేయర్స్). క్వింటన్ డి కాక్, జేమ్స్ ప్యాటిన్సన్, నాథన్ కూల్టర్ నీల్, ట్రెంట్ బౌల్ట్, పొలార్డ్, క్రిస్ లిన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మెక్లీనగన్ (ఫారిన్ ప్లేయర్స్).
చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మురళీ విజయ్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, పీయూష్ చావ్లా, నారాయణ్ జగదీశన్, కేఎం ఆసిఫ్, శార్దుల్ ఠాకూర్, సాయికిషోర్, మోను కుమార్, కరణ్ శర్మ (ఇండియన్ ప్లేయర్స్). ఇమ్రాన్ తాహిర్, లుంగి ఇన్‌గిడి, షేన్ వాట్సన్, మిషెల్ సాన్‌ట్నర్, ఫాఫ్ డు ప్లెసిస్, డ్వేన్ బ్రేవో, జోష్ హాజల్‌వుడ్, స్యామ్ కరన్ (ఫారిన్ ప్లేయర్స్).