”చెన్నై మొదటిగా ధోనిని తీసుకోవాలనుకోలేదట”..

|

Sep 13, 2020 | 3:06 PM

చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్ చరిత్రలో మూడుసార్లు టైటిల్ గెలవడమే కాకుండా ఆడిన ప్రతీసారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ఏకైక జట్టు. ఇక ఈ ఫ్రాంచైజీ విజయాలకు అసలు కారణం ధోని.

చెన్నై మొదటిగా ధోనిని తీసుకోవాలనుకోలేదట..
Follow us on

Dhoni Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్… ఐపీఎల్ చరిత్రలో మూడుసార్లు టైటిల్ గెలవడమే కాకుండా ఆడిన ప్రతీసారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ఏకైక జట్టు. ఇక ఈ ఫ్రాంచైజీ విజయాలకు అసలు కారణం ధోని. ఇది అందరికీ తెలిసిన అక్షర సత్యం. ధోని కూల్ కెప్టెన్సీ, అతని వ్యూహం చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా మార్చాయి. అయితే 2008 ఐపీఎల్ ఆరంభ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. తమ జట్టు కీలక ఆటగాడిగా మొదట ధోనిని అనుకోలేదని ఆ జట్టు మాజీ ప్లేయర్ సుబ్రమణ్య బద్రీనాధ్ వెల్లడించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మొదటిగా భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను తీసుకుని, అతడికే కెప్టెన్సీ అప్పగించాలని అనుకున్నారు. అయితే సెహ్వాగ్ ఢిల్లీ జట్టు తరపున ఆడతానని చెప్పడంతో.. చెన్నై ఫ్రాంచైజీ ధోనీపై గురి పెట్టారని బద్రీనాధ్ పేర్కొన్నాడు. 2008లో జరిగిన మొదటి వేలంలో చెన్నై జట్టు ధోనిని రూ. 6 కోట్లకు దక్కించుకుంది. ఇక ఆ ముందు ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ధోని నాయకత్వంలోనే భారత్ విజయకేతనం ఎగరేసిన దాన్ని పరిగణనలోకి తీసుకుని కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారని బద్రీనాధ్ చెప్పుకొచ్చాడు.