ఇన్‌స్టాగ్రామ్‌ కీలక నిర్ణయం.. ఇకపై వాటికి అనుమతి తప్పనిసరి..

కంటెంట్‌కు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇతరుల ఇన్‌స్టాలోని ఫోటోలను థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు ఎంబైడ్‌ చేసుకోవాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది...

ఇన్‌స్టాగ్రామ్‌ కీలక నిర్ణయం.. ఇకపై వాటికి అనుమతి తప్పనిసరి..
Follow us

|

Updated on: Jun 07, 2020 | 5:26 PM

కంటెంట్‌కు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇతరుల ఇన్‌స్టాలోని ఫోటోలను, పోస్టులను థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు లేదా ఇతరులు ఎంబైడ్‌ చేసుకోవాలంటే తప్పనిసరిగా సంబంధిత యూజర్ల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లేకపోతే కాపీరైట్ చట్టం కింద నోటిసులు పంపిస్తామని హెచ్చరించింది.

Also Read: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి బోర్డర్‌లో తనిఖీల్లేవు..

తాజాగా నిబంధనలకు విరుద్ధంగా ఓ జాతీయ మీడియా వెబ్‌సైట్ ఒక ఫోటోగ్రాఫర్ అకౌంట్‌లోని ఫోటోలను ఎంబైడ్‌ చేసుకోవడంతో.. సదరు సైట్‌పై కాపీరైట్ ఉల్లంఘన చట్టం కింద దావా వేశారు. కానీ సదరు వెబ్‌సైట్ తమ చర్యలను సమర్ధించుకుంటూ.. ఫోటోను నేరుగా అప్‌లోడ్ చేయకుండా ఇన్‌స్టాగ్రామ్ నుండి ఎంబైడ్‌ చేసుకున్నామని.. దానికి అనుమతి అవసరం లేదని చెప్పుకొచ్చింది.

Also Read: షాకింగ్: గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ నెంబర్లు.. ప్రమాదంలో యూజర్ల వివరాలు..

అయితే ఇన్‌స్టాగ్రామ్‌ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం.. ప్రతీ యూజర్ ఓ ఫోటోను అప్‌లోడ్ చేసిన ప్రతీసారి ఇన్‌స్టాగ్రామ్‌కు కాపీరైట్ లైసెన్స్‌ను అందిస్తారు. ఇక ఆ లైసెన్స్ ఎంబైడ్‌ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులను ప్రచురించే థర్డ్ పార్టీ వెబ్‌సైట్లకు వర్తించదు. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌ను ఇటీవల ఫేస్‌బుక్‌ కొనుగోలు చేయగా.. ఈ కాపీరైట్ నిబంధనలు అందరికీ వర్తిస్తాయో లేదో అనే దానిపై ఇంకా ఈ సంస్థ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Also Read: 

పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..

భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ 10 నుంచి దుర్గమ్మ దర్శనానికి అనుమతి..

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండిలా..

Latest Articles