జార్జిరెడ్డి ఓ వీధి రౌడీ.. సినిమా తీస్తే నాకేంటి ?

జార్జిరెడ్డి సినిమా విడుదలకు ముందు సంచలనమే. విడుదలైన తర్వాత పెద్దగా చర్చేమీ లేదు. ఎందుకంటే.. అందరూ అనుకున్నట్లు ఏ ఒక్క విద్యార్థి సంఘ నేతలనో హంతకులుగా చిత్రీకరించకపోవడమే వివాదం సమసిపోవడానికి కారణమైంది. అయితే.. ఉన్నట్లుండి తెరమీదికొచ్చిన బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి.. జార్జిరెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంద్రసేనారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో జార్జిరెడ్డికి జూనియర్. ‘‘ జార్జిరెడ్డి వీధిరౌడిగా ఉండేవాడు.. తన్నేవాడు, తన్నించుకునేవాడు.. ఆఖరుకు అలాగే చచ్చాడు ’’ ఇవి ఉస్మానియా విద్యార్థి సంఘ నాయకుడు […]

జార్జిరెడ్డి ఓ వీధి రౌడీ.. సినిమా తీస్తే నాకేంటి ?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 23, 2019 | 5:27 PM

జార్జిరెడ్డి సినిమా విడుదలకు ముందు సంచలనమే. విడుదలైన తర్వాత పెద్దగా చర్చేమీ లేదు. ఎందుకంటే.. అందరూ అనుకున్నట్లు ఏ ఒక్క విద్యార్థి సంఘ నేతలనో హంతకులుగా చిత్రీకరించకపోవడమే వివాదం సమసిపోవడానికి కారణమైంది. అయితే.. ఉన్నట్లుండి తెరమీదికొచ్చిన బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి.. జార్జిరెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంద్రసేనారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో జార్జిరెడ్డికి జూనియర్.

‘‘ జార్జిరెడ్డి వీధిరౌడిగా ఉండేవాడు.. తన్నేవాడు, తన్నించుకునేవాడు.. ఆఖరుకు అలాగే చచ్చాడు ’’ ఇవి ఉస్మానియా విద్యార్థి సంఘ నాయకుడు జార్జిరెడ్డి మీద బిజెపి సీనియర్ నాయకుడు ఇంద్రసేనారెడ్డి చేసిన వ్యాఖ్యలు. అయితే.. వీథిరౌడీ అయినంత మాత్రాన అతని మీద సినిమా తీయొద్దని తానేమీ చెప్పడం లేదని ఆయనంటున్నారు. ఎవరు ఎవరి మీద అయిన సినిమా తీసుకో వచ్చని, పూలన్ దేవి మీద కూడా సినిమా తీశారని, చిన్న పిల్లలపై అత్యాచారం చేసిన వారిపై కూడా తీశారని ఇంద్రసేనారెడ్డి అన్నారు. జార్జిరెడ్డి సినిమా కూడా అంతేనని తాను భావిస్తున్నట్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. జార్జిరెడ్డి సినిమాను బీజేపీ ఏ ఇతర కోణంలో చూడ దలుచు కోలేదని చెప్పుకొచ్చారు ఇంద్రసేనారెడ్డి.

కాగా జార్జిరెడ్డి అగ్రవర్ణ విద్యార్థి నాయకులపై 1970-72 మధ్యకాలంలో విపరీతంగా దాడులు జరిపిన సంగతి తెలిసిందే. జార్జిరెడ్డి దాడిచేసిన వారిలో ఇంద్రసేనారెడ్డి కూడా ఒకరన్న ప్రచారం వుంది. ఈ నేపథ్యంలో ఇంద్రసేనారెడ్డి జార్జిరెడ్డి సినిమాపై చేసిన కామెంట్లు హీటెక్కిస్తున్నాయి. ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యలపై జార్జిరెడ్డి అభిమానులు, అప్పట్లో ఆయనకు సహచరులుగా వ్యవహరించిన వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Latest Articles
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
'ఈ సమయంలో బయటకి పోవొద్దు..' ఆరోగ్య శాఖ కీలక సూచన
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
సరదాగా డ్యాన్స్ చేసినా.. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
విరాళాలపై ప్రత్యేక పన్ను రాయితీలు..ఆ నిబంధనలు పాటించకపోతే నష్టాలు
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
ఈ గింజలను చిన్నచూపు చూడకండి.. చెంచాడు తింటే అద్భుతమే..
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!
ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!
ఈ చేపలు తిన్నారంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండనే ఉండదు..
ఈ చేపలు తిన్నారంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండనే ఉండదు..
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. ఈ తేదీల్లో పర్యట
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. ఈ తేదీల్లో పర్యట
వ్యర్థ ఉత్పత్తులతో అదిరే బిజినెస్..ఆ వ్యాపారంలో రాణిస్తున్న మహిళ
వ్యర్థ ఉత్పత్తులతో అదిరే బిజినెస్..ఆ వ్యాపారంలో రాణిస్తున్న మహిళ