పగ తీర్చుకున్న కివీస్..వన్డే సిరీస్ క్లీన్ స్వీప్…

భారత్‌ చేతిలో టీ20 సిరీస్‌లో వైట్‌వాష్ అయిన కివీస్ ప్రతీకారం తీర్చకుంది. తాజాగా ఇండియాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మూడు వన్డేలో ఇండియా ఇచ్చిన 297 పరుగుల టార్గెట్‌ను 47.1 ఓవర్లలోనే కంప్లీట్ చేసిన న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్‌లో హెన్రీ నికోల్స్ 80 పరుగులు చేయగా, మార్టిన్ గుప్టిల్ వేగంగా 66 పరుగులు.. కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ 58 రన్స్‌తో హాఫ్ సెంచరీలతో చెలరేగి […]

పగ తీర్చుకున్న కివీస్..వన్డే సిరీస్ క్లీన్ స్వీప్...
Follow us

|

Updated on: Feb 11, 2020 | 4:26 PM

భారత్‌ చేతిలో టీ20 సిరీస్‌లో వైట్‌వాష్ అయిన కివీస్ ప్రతీకారం తీర్చకుంది. తాజాగా ఇండియాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మూడు వన్డేలో ఇండియా ఇచ్చిన 297 పరుగుల టార్గెట్‌ను 47.1 ఓవర్లలోనే కంప్లీట్ చేసిన న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్‌లో హెన్రీ నికోల్స్ 80 పరుగులు చేయగా, మార్టిన్ గుప్టిల్ వేగంగా 66 పరుగులు.. కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ 58 రన్స్‌తో హాఫ్ సెంచరీలతో చెలరేగి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. 

భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్‌కు ఓపెనింగ్ జోడి మంచి శుభారంబాన్ని ఇచ్చారు. గుప్తిల్‌ అయితే తొలి ఓవర్‌ నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. భారత్ ఏస్ బౌలర్లు..జస్ప్రీత్ బుమ్రా, నవదీప్‌ సైనీ బౌలింగ్‌లో కూడా అలవోకగా పరుగులు చేశాడు. 29 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ చేశాడంటే..ఏ స్థాయిలో విజృంభించాడో అర్థం చేసుకోవచ్చు. హెన్రీ నికోల్స్‌ సింగిల్స్ తీస్తూ గుప్తిల్‌కు మంచి భాగస్వామ్యం అందించాడు. అయితే చాహల్ వేసిన 17 వ ఓవర్ 3వ బంతికి భారీ షాట్ ఆడబోయిన గుప్తిల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడుతున్నా మరోవైపు హెన్రీ నికోల్స్ వడివడిగా పరుగులు చేస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఐదు వికెట్లు పడి మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చిందనుకుంటున్న సమయంలో రెచ్చినపోయిన లాతమ్ (32), గ్రాండ్‌హోమ్‌ (58) పరుగులతో అదరగొట్టారు. దీంతో కివీస్ ఈజీగా విజయం సాధించింది.

ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లతో 7 వికెట్లు కోల్పోయి 296 రన్స్ చేసింది.  రాహుల్ సెంచరీ (113 )తో చెలరేగగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (62; ఫోర్లు 9) మంచి ఇన్నింగ్స్ ఆడాడు.  మనీష్ పాండే కూడా  48 బంతుల్లో 42 రన్స్ చేసి తనకొచ్చిన ఛాన్స్‌ని వినియోగించుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో  బెన్నెట్ 4 వికెట్లు తీయగా..నీషమ్‌, జెమిసన్‌లకు చెరో వికెట్ దక్కింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు