భారత్ :‌ మే నెల రెండో వారంలో పీక్‌ స్టేజీలోకి కరోనా.. !

భారత్‌లో కరోనా వైరస్‌ ప్రతాపం మే నెల రెండో వారంలో తీవ్ర స్థాయిలో ఉంటుందని.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 75 వేల వరకూ ఉంటుందని ఒక ప్రముఖ మీడియా సంస్థ అధ్యయనంలో తేలింది. మే నెల మధ్యలో కరోనా బాధితుల సంఖ్య పీక్‌ స్టేజీలో ఉంటుందని… ఆ తర్వాత క్రమంగా బాధితుల సంఖ్య తగ్గుతుందని చెప్పింది. మే 22 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 75వేల వరకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం వివిధ వాతావరణ […]

Follow us

|

Updated on: Apr 23, 2020 | 9:58 PM

భారత్‌లో కరోనా వైరస్‌ ప్రతాపం మే నెల రెండో వారంలో తీవ్ర స్థాయిలో ఉంటుందని.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 75 వేల వరకూ ఉంటుందని ఒక ప్రముఖ మీడియా సంస్థ అధ్యయనంలో తేలింది. మే నెల మధ్యలో కరోనా బాధితుల సంఖ్య పీక్‌ స్టేజీలో ఉంటుందని… ఆ తర్వాత క్రమంగా బాధితుల సంఖ్య తగ్గుతుందని చెప్పింది. మే 22 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 75వేల వరకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం వివిధ వాతావరణ పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి ఎలా ఉన్నది?, ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది?, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి? వంటి అంశాల ఆధారంగా అధ్యయన బృందం మూడు నమూనాలను రూపొందించింది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులపాటు కొనసాగించాలని అధ్యయనం సూచించింది. దేశంలో లాక్‌డౌన్‌ మే 3వ తేదీ వరకు కొనసాగనున్నది. ప్రస్తుతం వైరస్‌ పునరుత్పత్తి రేటు 0.8గా ఉన్నది. అంటే ఒక కరోనా రోగి నుంచి 0.8 మందికి వ్యాధి వ్యాపిస్తున్నది. దీని ఆధారంగా రెండు అంచనాలను విడుదల చేశారు. లాక్‌డౌన్‌ను మే 15వరకు పొడిగిస్తే సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు రోగుల సంఖ్య సున్నాకు తగ్గుతుంది. ఒకవేళ లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగించగలిగితే.. జూన్‌నెల మధ్యలోనే కేసులు సున్నాకు పడిపోతాయని పరిశోధకులు తేల్చారు.