Defence deal with USA: అమెరికాతో రక్షణ ఒప్పందం ఇదే

అమెరికా అధ్యక్షుని హోదాలో తొలిసారి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో ఇరు దేశాల మధ్య కుదిరే రక్షణ ఒప్పందాల వివరాలను టీవీ9 వెబ్‌సైట్ సంపాదించింది. దేశ రక్షణలో మరీ ముఖ్యంగా వాయు, నావికా దళాలను బలోపేతం చేయడంతోపాటు నిఘా వ్యవస్థను ముమ్మర పరిచే విధంగా డిఫెన్స్ డీల్ కుదరనున్నట్లు తెలుస్తోంది.

Defence deal with USA: అమెరికాతో రక్షణ ఒప్పందం ఇదే
Follow us

|

Updated on: Feb 24, 2020 | 3:12 PM

Defence deal between India and America: అమెరికా అధ్యక్షుని హోదాలో తొలిసారి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో ఇరు దేశాల మధ్య కుదిరే రక్షణ ఒప్పందాల వివరాలను టీవీ9 వెబ్‌సైట్ సంపాదించింది. మొత్తం 3 బిలియన్ డాలర్ల మేరకు భారత, అమెరికా రక్షణ ఒప్పందం కుదురుతుందని సాక్షాత్తు ట్రంప్… మొతెరా స్టేడియం వేదికగా వెల్లడించారు. అయితే.. ఆ రక్షణ ఒప్పందం వివరాలేంటన్నది మాత్రం ఆయన ప్రస్తుతానికి సీక్రెట్‌గానే వుంచారు.

అమెరికా అధ్యక్షుడు భారత పర్యటనకు వస్తున్నారనగానే అందరి మదిలో రెండంశాలు మెదిలాయి. అందులో ఒకటి రక్షణ ఒప్పందం కాగా.. రెండోది వాణిజ్య ఒప్పందం. అందుకు అనుగుణంగా ట్రంప్ పలు సందర్భాలలో భారత దేశం అమెరికాపై అధిక పన్నులు విధిస్తోందని చెబుతూ వచ్చారు. దాంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందమే కీలకమని తేలిపోయింది. అయితే ఇప్పటి వరకు వాణిజ్య ఒప్పందం వుంటుందా లేదా అన్నది తేలకపోయినా.. మొతేరా స్టేడియంలో ట్రంప్ చేసిన ప్రసంగంలో ఆయన రక్షణ ఒప్పందంపై ప్రకటన చేసేశారు.

భారత్, అమెరికాల మధ్య మూడు బిలియన్ డాలర్ల మొత్తంతో రక్షణ ఒప్పందంపై మంగళవారం సంతకం చేయనున్నట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అందులో కీలకాంశాలేంటన్నది టీవీ9 వెబ్‌సైట్ సంపాదించింది. వివరాలు ఇలా వున్నాయి:

# 24 ‘ఎంహెచ్-60(ఆర్) మల్టీ రోల్’ హెలీకాప్టర్లు, 6 ‘ఏహెచ్-64(ఈ) అపాచీ అటాక్’ హెలీకాప్టర్ల కొనుగోలు డీల్

# 10 హై ఆల్టిట్యూట్ లాంగ్ ఎండ్యూరన్స్ (హేల్) డ్రోన్ల కొనుగోలుకు అవకాశం

# సాయుధ డ్రోన్లు, దేశ రాజధాని ఢిల్లీ రక్షణకు ఎయిర్ డిఫెన్స్ సిస్టం కొనుగోలుపై చర్చలు

# పైప్‌లైన్లో ఎంకే-45 127 ఎం.ఎం నావల్ గన్స్, 6 పీ-81 లాంగ్ మారిటైం ప్యాట్రోల్ ఎయిర్‌క్రాఫ్టులు

# సముద్ర తీర భద్రత కోసం ఎంక్యూ-9 రీపర్, ప్రిడేటర్-బీ హేల్ డ్రోన్లు

# పీ-81 ఎయిర్‌క్రాఫ్ట్‌ లను యాంటీ సబ్-మెరైన్ వార్‌ ఫేర్, హేల్ డ్రోన్లు

# మిస్సైల్, రాడార్ అమర్చిన ప్రిడేటర్-బీ సీగార్డియన్ డ్రోన్ల కొనుగోలు (ప్రిడేటర్-బీ డ్రోన్లకు 40,000 అడుగుల ఎత్తు వరకు 35 గంటల పాటు ఎగర గలిగే సామర్థ్యం వుంటుంది)

వీటికి సంబంధించి ఇరు దేశాల రక్షణ శాఖ స్ట్రాటెజిక్ మెంబర్లు పలు దఫాలుగా సమాలోచనలు జరిపి, ఆల్‌రెడీ ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో జరిగే శిఖరాగ్ర చర్చల తర్వాత ఇరు దేశాల ప్రతినిధులు రక్షణ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందం వివరాలను డొనాల్డ్ ట్రంప్, నరేంద్రమోదీలు ఉమ్మడి విలేకరుల సమావేశంలో వెల్లడించే అవకాశం వుంది.