దేశంలో క‌రోనా​ విజృంభణ…ఒక్కరోజే 20 వేలకుపైగా కేసులు

దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 20 వేల 903 మంది వైరస్​ సోకింది.

దేశంలో క‌రోనా​ విజృంభణ...ఒక్కరోజే 20 వేలకుపైగా కేసులు
Follow us

|

Updated on: Jul 03, 2020 | 10:39 AM

దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 20 వేల 903 మంది వైరస్​ సోకింది. మరో 379 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది.

దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544

ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,27,439

వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,79,892

క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,213

మహారాష్ట్రలో వైరస్ ప్ర‌మాక‌రంగా​ విజృంభిస్తోంది. అక్క‌డ‌ మొత్తం కేసుల సంఖ్య 1,86,626కు చేరింది. వీరిలో 8178 మంది వైరస్​ కార‌ణంగా ప్రాణాలు విడిచారు.తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 98,392కు చేరగా.. మరణాల సంఖ్య‌ 1,321గా ఉంది. గుజరాత్​లో సులు 33 వేలు దాటగా.. 1886 మంది చనిపోయారు. ఢిల్లీలో 2,864 మంది క‌రోనా కార‌ణంగా మ‌రిణించారు.