నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర… నోటిఫికేషన్ జారీ!

IBPS releases notification for 12074 clerk posts, నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర… నోటిఫికేషన్ జారీ!

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS. దీనిద్వారా ఐబీపీఎస్ పరిధిలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొత్తం 12,075 క్లర్కు పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు 612 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌కు 777 పోస్టును కేటాయించారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రెండు దశల (ప్రిలిమినరీ, మెయిన్) రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

క్లర్క్ పోస్టులకు సెప్టెంబ‌రు 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 9 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు రుసుము రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ల‌కు ద‌ర‌ఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించారు. ఫీజును ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి. మొదటి విడత (ప్రిలిమినరీ) ఆన్‌లైన్ రాతపరీక్షలను డిసెంబ‌రులో, రెండో విడత (మెయిన్) రాతపరీక్షలను 2019 జనవరిలో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారే.. మెయిన్ పరీక్షలకు అర్హత పొందుతారు. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *