వివేకా హత్యతో నాకు సంబంధం లేదు: సుధాకర్ రెడ్డి

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజారెడ్డి హత్యకేసు నిందితుడు సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని, జైలు నుంచి విడుదల అయ్యాక తాను వ్యవసాయం చేసుకుంటూ బతుకు వెల్లదీస్తున్నానని ఆయన చెప్పారు. వైఎస్ రాజారెడ్డి హత్యలో కూడా తనకు సంబంధం లేదని, కానీ ఆ కేసులో శిక్ష అనుభవించానని అన్నారు. గతేడాది జూలై 20న జైలు నుంచి విడుదలై వచ్చానని, అప్పటి […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:28 am, Sat, 16 March 19

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజారెడ్డి హత్యకేసు నిందితుడు సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని, జైలు నుంచి విడుదల అయ్యాక తాను వ్యవసాయం చేసుకుంటూ బతుకు వెల్లదీస్తున్నానని ఆయన చెప్పారు. వైఎస్ రాజారెడ్డి హత్యలో కూడా తనకు సంబంధం లేదని, కానీ ఆ కేసులో శిక్ష అనుభవించానని అన్నారు. గతేడాది జూలై 20న జైలు నుంచి విడుదలై వచ్చానని, అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబంతో బతుకుతున్నానని సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ కేసులో తనను లాగొద్దంటూ ఈ సందర్భంగా విఙ్ఞప్తి చేశారు. అయితే ఈ కేసులో సుధాకర్ రెడ్డిపై పలువురు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.