Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయకండి – హైపర్ ఆది

Hyper Aadi, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయకండి – హైపర్ ఆది

2019 ఎన్నికల్లో హీరో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తొలిసారి పోటీ చేసి ఓటమి పాలైంది. ‘వస్తున్నాం.. మారుస్తున్నాం’ అనే నినాదంతో జనసేనాని ప్రజల్లోకి వెళ్లినప్పటికీ వారి నుంచి మాత్రం పెద్దగా మద్దతు లభించలేదని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని గురువారం వెలువడిన ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి.

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచార సమయంలో జనసేన పార్టీ తరుపున పాల్గొని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓటర్లు ఇచ్చిన తీర్పుకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద ట్వీట్స్ చేసినట్లు కొద్ది రోజులుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఈ వార్తలపై స్పందిస్తూ ఆది ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

‘నా పేరుమీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫేక్ పోస్టులు పెడుతున్నారు. అవేవి నమ్మకండి. నాకు  ఏ అకౌంట్లు లేవు. ముఖ్యంగా 30వ తేదీన ముుఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న వైఎస్ జగన్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే పవన్‌కళ్యాణ్ గారికి ఓటేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమిని అంగీకరించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఎలక్షన్ అయిపోయింది కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండండి. ఎవరూ ఎవరి మీదా నెగిటివ్ పోస్టులు పెట్టకండి. థాంక్యూ’ అంటూ హైపర్ ఆది వీడియోలో జనసైనికులకు సూచించారు.

Hyper Aadi यांनी वर पोस्ट केले शनिवार, २५ मे, २०१९