Facebook: యూజర్లు చనిపోతే ఫేస్‌బుక్‌ అకౌంట్స్‌ను ఏం చేస్తారు.?

ఇదిలా ఉంటే ప్రతీ రోజూ ఎంతో మంది చనిపోతుంటారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎంతో మంది ఈ లోకాన్ని వదిలిపోతుంటారు. మరి చనిపోయిన వారి ఫేస్‌బుక్‌ ఖాతాలు ఏమవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా.? లాగిన్‌ వివరాలు కేవలం సదరు యూజర్లకు మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అకౌంట్స్‌ ఏమవుతాయి.? వాటిని ఫేస్‌ ఏం చేస్తుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Facebook: యూజర్లు చనిపోతే ఫేస్‌బుక్‌ అకౌంట్స్‌ను ఏం చేస్తారు.?
Facebook

Updated on: Nov 19, 2023 | 6:29 PM

ప్రస్తుతం బ్యాంక్‌ ఖాతా లేని వారు ఉన్నారేమో కానీ ఫేస్‌బుక్‌ ఖాతాలేని వారు మాత్రం లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్మార్ట్ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరికీ, లేని వారికి కూడా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉన్న పరిస్థితి ఉంది. ప్రతీ ఒక్కరికీ ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ ఛార్జీలు సైతం భారీగా తగ్గుముఖం పట్టడంతో ఫేస్‌బుక్‌ ఉపయోగించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది.

ఇదిలా ఉంటే ప్రతీ రోజూ ఎంతో మంది చనిపోతుంటారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎంతో మంది ఈ లోకాన్ని వదిలిపోతుంటారు. మరి చనిపోయిన వారి ఫేస్‌బుక్‌ ఖాతాలు ఏమవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా.? లాగిన్‌ వివరాలు కేవలం సదరు యూజర్లకు మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అకౌంట్స్‌ ఏమవుతాయి.? వాటిని ఫేస్‌ ఏం చేస్తుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఫేస్‌ బుక్‌ అకౌంట్ ఉన్న వ్యక్తి ఒకవేళ మరణిస్తే.. ఆ విషయాన్ని ఫేస్‌బుక్‌ యాజమాన్యానికి తగిన ఆధారాలతో సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఫేస్‌ బుక్‌ వెంటనే వారి ఖాతాలోని ఫొటోలను, వీడియోలను డిలీట్‌ చేస్తుంది. అయితే సదరు వ్యక్తి మరణించినట్లు తగిన ఆధారాలతో సమాచారం అందించాలి. దీంతో చనిపోయిన వారి అకౌంట్‌ సేఫ్‌గా ఉంటుంది. సదరు అకౌంట్‌ను ఎవరూ మిస్‌యూజ్‌ చేయకుండా ఉంటారు.

దీంతోపాటు మెమొరియలైజ్డ్‌ ప్రొఫైల్‌ అనే మరో ఆప్షన్‌ను కూడా అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే చనిపోయిన వారి ప్రొఫైల్‌లో వారితో ఉన్న తమ జ్ఞాపకాలను, అనుబంధాన్ని నెమరేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే ఇక్కడ కూడా.. చనిపోయిన వారి ఫేస్‌బుక్‌ ఖాతా ఎలాంటి దుర్వినియోగం కాకుండా ఉండేందుకు సదరు వ్యక్తుల అకౌంట్‌లోకి ఎవ్వరూ లాగిన్‌ కాకుండా వీలుకాకుండా, ఫేస్‌బుక్‌ డిసేబుల్ చేసి పెట్టేస్తుంది.

మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి..