Watch Video: అయ్యయ్యో.! చూడగానే ‘దెయ్యం’ అనుకునేరు.. వీడియో చూస్తే అసలు విషయం తెలుస్తది..

|

Nov 28, 2022 | 7:58 PM

ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని భయాన్ని పుట్టిస్తాయి..

Watch Video: అయ్యయ్యో.! చూడగానే దెయ్యం అనుకునేరు.. వీడియో చూస్తే అసలు విషయం తెలుస్తది..
Trending Video
Follow us on

ఫన్‌కు ఇంటర్నెట్ కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని భయాన్ని పుట్టిస్తాయి. ప్రస్తుతం అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. అసలు ఆ వీడియో ఏంటి.? అదేంటో ఇప్పుడు చూసేద్దాం..

‘కళ్లు రుద్దుకోవడం’.. మనం రోజూ చేసే ఓ శారీరిక చర్య. స్పృహతో లేదా ఉపచేతనంగా మనం అప్పుడప్పుడూ ఇలా కళ్లు రుద్దుకుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మీ ఒత్తిడి తగ్గొచ్చు లేదా మీకు ఇన్ఫెక్షన్, అలెర్జీ ఉన్నప్పుడు కూడా కళ్లు రుద్దుకుంటుంటారు. మరి ఎప్పుడైనా కూడా మీరు కళ్లు రుద్దుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించేది ఏమిటని ఆలోచించారా.? గట్టిగా కళ్లు రుద్దుకున్నప్పుడు ఏం జరుగుతుంది.? ఎక్కువసేపు రుద్దితే కళ్లు ఎందుకు ఎర్రగా మారతాయి. మీరు మీ కళ్లను ఎక్కువగా రుద్దినప్పుడు మీ పుర్రె లోపల ఏమి జరుగుతుందో మీరెప్పుడైనా ఊహించారా.?

ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కళ్లు రుద్దుకున్నప్పుడు పుర్రెలో ఏం జరుగుతుందో చెప్పేలా.. రెడిట్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ క్లిప్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఎలాంటి భయానక కదలికలు లేకపోవడంతో నెటిజన్లు ఉపశమనం పొందారు. క్లిప్‌ను చూసినట్లయితే.. వ్యక్తి తన కళ్లను రుద్దుతున్నప్పుడు రెండు కనుబొమ్మలు వాటి సాకెట్లలో కదులుతున్నట్లు మీరు చూడవచ్చు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.