Fact: ఏదైనా ఆలోచించేప్పుడు.. కళ్లు పక్కకి ఎందుకు తిప్పుతామో తెలుసా.?

|

Nov 29, 2024 | 5:45 PM

ఏదైనా విషయాన్ని ఆలోచించే సమయంలో మనకు తెలియకుండానే కళ్లను పక్కకు తిప్పుతుంటాం. పైకి చూడడం లేదా దూరంగా చూస్తున్నట్లు కళ్ల దిశ మారుతుంది. అయితే దీని వెనకాల అసలు కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతకీ ఇలా కళ్లను తిప్పడం వెనకాల ఉన్న కారణం ఏంటి.? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Fact: ఏదైనా ఆలోచించేప్పుడు.. కళ్లు పక్కకి ఎందుకు తిప్పుతామో తెలుసా.?
Fact
Follow us on

గతంలో జరిగిన విషయాలను, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవండం సర్వసాధారణమైన విషయం. మనల్ని ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగిన వెంటనే చేసే పని.. ఆలోచించడం. ఆలోచిస్తేనే మెమోరీ కీ కలక్ట్‌ అవుతుందని తెలిసిందే. అయితే దేని గురించైనా ఆలోచించే సమయంలో మనకు తెలియకుండానే కళ్లను పక్కకు తిప్పుతుంటాం. లేదంటే కొన్ని సందర్భాల్లో కళ్లను పైకి తిప్పుతాం. ఇంతకీ ఆలోచించే సమయంలో ఇలా కళ్లు ఎందుకు తిప్పుతామో ఎప్పుడైనా ఆలోచించారా.? దీని వెనకాల ఓ శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆలోచించే సమయంలో కళ్లను ఎందుకు తిప్పుతారన్న దానికి సంబంధించిన పరిశోధకులు పలు విషయాలు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైంది.. మనం ఏదైనా ఆలోచించే సమయంలో మనసుపై ఒత్తిడి పెరుగుతుంది. పాత విషయాలను గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటామని నిపుణులు అంటున్నారు. ఏదైనా విషయాన్ని గుర్తు చేసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న ఏకాగ్రతను డైవర్ట్‌ చేయాలి. ప్రస్తుతం చూస్తున్న దృశ్యాన్ని మరల్చడానికే కళ్లను పక్కకు తిప్పుతామని నిపునులు అభిప్రాయపడుతున్నారు.

ఇలా చేయడం వల్ల ఏకాగ్రత ప్రస్తుతం దృశ్యాల నుంచి మరలి పాత జ్ఞాపకాలను గుర్తు చేసేందుకు మెదడును ప్రేరేపిస్తుందని అంటున్నారు. అలాగే ఏదైనా పాత జ్ఞాపకాన్ని రీకాల్‌ చేసుకునే సమయంలో దూరంగా చూస్తుంటారు. కళ్లను డీ ఫోకస్‌ చేసి, పాత జ్ఞాపకాలను రీకాల్‌ చేసేందుకే ఇలా చేస్తారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం మనిషి తనకు తెలిసిన విషయాన్ని లేదా అంతకు ముందు చూసిన విషయాన్ని మాత్రమే రీకాల్‌ చేసుకునే శక్తి ఉంటుందనిని పరిశోధకులు అంటున్నారు. అయితే కళ్లను ఇలా పక్కకు తిప్పుకోవడం వెనకాల నిర్ధిష్టమైన కారణం అంటూ ఏది లేదని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..