Railway Crossing: రైల్వే ట్రాక్‌లపై W/L అనే బోర్డు ఎందుకు ఉంటుంది.. పూర్తి వివరాలు

|

Feb 23, 2022 | 9:03 PM

Railway Crossing: రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలను పెద్దగా గుర్తించము. రైల్వే ట్రాక్‌లపై, క్రాసింగ్‌ల వద్ద కొన్ని బోర్డులను ఏర్పాటు చేస్తుంది భారతీయ రైల్వే..

Railway Crossing: రైల్వే ట్రాక్‌లపై W/L అనే బోర్డు ఎందుకు ఉంటుంది.. పూర్తి వివరాలు
Follow us on

Railway Crossing: రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలను పెద్దగా గుర్తించము. రైల్వే ట్రాక్‌లపై, క్రాసింగ్‌ల వద్ద కొన్ని బోర్డులను ఏర్పాటు చేస్తుంది భారతీయ రైల్వే (Indian Railway) శాఖ. ఒక వేళ అలాంటి బోర్డులు చూసినా పెద్దగా పట్టించుకోము. అందులో ఎంతో అర్థం ఉంటుంది. ఇక సాధారణంగా రైల్వే ట్రాక్‌ల (Railway Track) పక్కన, క్రాసింగ్‌ వల్ల W/L అని బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. W/L అంటే విజిల్ / లెవెల్ బోర్డ్ అని అర్థం. ఇది ట్రాక్‌లకు రెండు వైపులా ఏర్పాటు చేసి ఉంటాయి.

భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. లోకో పైలట్‌ను అప్రమత్తం చేయడానికి ఈ బోర్డును ఏర్పాటు చేస్తుంది రైల్వేశాఖ. రైల్వే క్రాసింగ్‌ రెండు వైపుల వద్ద ఈ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు దాటడానికి 600 మీటర్ల ముందు ఏర్పాటు చేసి ఉంటుంది. ఈ బోర్డు గుండా వెళుతున్నప్పుడు లోకో పైలట్‌కు హారన్ ఇవ్వడం తప్పనిసరి. బోర్డు దాటే వరకు నిరంతరంగా హరన్‌ సౌండ్‌ మోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా రైలు వస్తున్నట్లు హరన్‌ మోగించడం. అందుకే ఈ W/L బోర్డులను ఏర్పాటు చేస్తారు.

ఈ బోర్డును ఏర్పాటు చేయడానికి పసుపు రంగును ఉపయోగిస్తారు. దానిపై W/L అని నలుపు రంగుతో రాయబడి ఉంటుంది. తద్వారా ఇది దూరం నుండి కనిపిస్తుంది. ఇది చూసిన రైలు డ్రైవర్ క్రాసింగ్ గేటు దగ్గర నిలబడిన వారిని హారన్ కొడుతూ హెచ్చరించాడు. ఈ విధంగా డ్రైవర్ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ బోర్డును ఏర్పాటు చేస్తారు. ఈ బోర్డును చూసిన రైలు డ్రైవర్‌ హరన్‌ మోగిస్తుంటాడు.

రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఈ బోర్డును ఏర్పాటు చేయడంలో కూడా నిబంధనలు ఉంటాయి. ఈ బోర్డు నేల నుండి సుమారు 2100 మిమీ ఎత్తులో ఉంటుంది. ఇక్కడ రెండు బోర్డులు ఏర్పాటు చేస్తారు. మొదటిది ఆంగ్లంలో, రెండవది హిందీలో. రెండు రకాల బోర్డుల వైశాల్యం 600 చదరపు మిల్లీమీటర్లు. అవి ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Hypothyroid: మీకు హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉందా ? ఈ ఆహారాలను తీసుకోండి

Viral Photo: మీ మెదడుకు పరీక్ష.. 9=8.? ఈ పజిల్ సాల్వ్ చేస్తే మీరే జీనియస్.!!