సాధారణంగా పాములంటే చాలు.. ప్రతీ ఒక్కరికీ భయం ఉంటుంది. వాటిని దూరం నుంచి చూస్తే.. గుండె జారి గల్లంతవుతుంది. అక్కడ నుంచి దెబ్బకు పరుగులు పెడతారు. అయితే ఈ మధ్యకాలంలో పాములు తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అలాంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. స్కూల్ బస్సులో, బైక్ స్పీడోమీటర్‌లో, ఇళ్లల్లోకి, రోడ్లపై.. ఇలా ఒకటేమిటి.. ఎక్కడి చూసినా అనుకోని అతిధుల్లా ప్రత్యక్షమై.. జనాలకు దడ పుట్టిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో కూడా పాములకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా అదే కోవలో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
కొన్ని సెకన్ల వ్యవధిలో ఓ స్కూల్ విద్యార్ధి పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కొల్లా జిల్లా కూన్నతుర్లో చోటు చేసుకుంది. తన ఇంటి గేటు బయట ఎవరితోనూ మాట్లాడిన ఓ స్కూల్ విద్యార్ధి.. కొద్దిసేపటి తర్వాత గేట్ వేసి లోపలి వచ్చాడు. అలా వస్తున్నప్పుడు.. అతడు మొక్కల మాటున దాగున్న పామును గమనించాడు. అలా ఆ యువకుడు అడుగు ముందుకేశాడో.. లేదో.. ఆ నాగుపాము అతడిని కాటేసేందుకు ప్రయత్నించింది. సెకన్ల వ్యవధిలో ఆ యువకుడు దాన్ని నుంచి తప్పించుకుని లోపలికి పరుగులు పెట్టాడు. అనంతరం అతడు ఆ గేటును తెరిచి.. లోపలికి వెళ్లి తన తల్లిని పామును చూపించేందుకు తీసుకురాగా.. అది అక్కడ నుంచి మెల్లిగా జారుకుంది.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘యువకుడు అదృష్టవంతుడని.. కొంచెం ఆలస్యమైనా అంతే సంగతులు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.