VIVO : ఈ మొబైల్ ఫోన్ కెమెరా గాల్లో ఎగురుతుందట..! ఎలాగో మీరే తెలుసుకోండి..

VIVO : కరోనా వల్ల ఉద్యోగులందరు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. విద్యార్థులందరు ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. దీంతో ప్రతి ఒక్కరికి సెల్‌ఫోన్ అత్యవసరమైంది.

VIVO : ఈ మొబైల్ ఫోన్ కెమెరా గాల్లో ఎగురుతుందట..! ఎలాగో మీరే తెలుసుకోండి..
Vivo
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 05, 2021 | 8:21 AM

VIVO : కరోనా వల్ల ఉద్యోగులందరు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. విద్యార్థులందరు ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. దీంతో ప్రతి ఒక్కరికి సెల్‌ఫోన్ అత్యవసరమైంది. స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక క్షణాల్లో ఫొటోలు, వీడియోలు తీసి నచ్చిన వారితోనో లేదా సామాజిక మాధ్యమాల్లోనో షేర్‌ చేస్తున్నాం. దీంతో మొబైల్ తయారీ కంపెనీలు ఫ్లిప్‌, పాప్‌అప్‌ వంటి వాటితోపాటు యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ కెమెరాలను అందిస్తున్నాయి. తాజాగా వివో కంపెనీ సరికొత్త మొబైల్‌ఫోన్ కెమెరాను తీసుకురానుందట. ఈ ఫోన్‌ కెమెరా డ్రోన్‌ కెమెరా తరహాలో ఎగురుతుందని సమాచారం. అయితే ఈ ఫోన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది. ఎలా పనిచేస్తు్ందో ఈ రోజు తెలుసుకుందాం.

మొబైల్ ప్రపంచంలో వివో కంపెనీ కొత్త కొత్త డిజైన్లతో, ఆధునిక హంగులతో మార్కెట్లో సెల్‌ఫోన్లను విడుదల చేస్తుంది. తాజాగా వివో మొబైల్ డ్రోన్‌ కెమెరా ఫోన్‌ను సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న ఈ కెమెరా ఫీచర్‌ను భవిష్యత్తులో రాబోయే ఫోన్లలో అందివ్వనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ కెమెరాను ఫోన్ కింది భాగంలో అమరుస్తారట. అలానే అవసరమైనప్పుడు తొలగించి డ్రోన్‌ తరహాలో దీనిని ఎగరెయ్యొచ్చు. వివో డ్రోన్‌ కెమెరాలో మొత్తం నాలుగు ప్రొపెల్లర్లు, ప్రత్యేక బ్యాటరీ, రెండు కెమెరాలు, రెండు ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్స్‌ ఉంటాయి.

అయితే ఇది ఎలా పనిచేస్తుంది..కెమెరాల సామర్థ్యం గురించిన వివరాలను వెల్లడించలేదు. ఎయిర్ పిక్స్‌ ఫ్లైయింగ్ కెమెరాను పోలి ఉండటంతోపాటు.. ఇందులోని ఆటోమేటిక్ ఫాలో మోడ్‌ ద్వారా స్వయంచాలితంగా ఎగిరే ఫీచర్‌ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. వివో ఫ్లైయింగ్ కెమెరా..ఎయిర్‌ పిక్స్‌ కంటే తక్కువ సైజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. అలానే వివో ఈ ఫోన్ కెమెరాను ఎప్పుడు విడుదల చేస్తుందనే దానిపై కూడా స్పష్టమైన సమాచారం లేదు. కాగా ఇటీవల ఈ కంపెనీ వివో వై 73 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది 4 జి నెట్‌వర్క్‌కు మద్దతు ఇచ్చే ప్రీమియం స్మార్ట్‌ఫోన్. అయితే, దీని ధర ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ కంటే చాలా తక్కువ.

India Drone guard: ఇజ్రాయెల్‌ డ్రోన్‌ గార్డ్‌ వ్యవస్థను కొనుగోలు చేయనున్న భారత్..? జమ్మూ డ్రోన్‌ దాడి నేపథ్యంలో..

Instagram Stories: ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కూడా డబ్బులు సంపాదించొచ్చు.. అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్‌.

Microsoft: విండోస్‌ యూజర్లకు మైక్రోసాఫ్ట్ హెచ్చరిక.. సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచన