Viral News: లక్ అంట్ ఇతనిదే.. చికెట్ కోసం కొట్టుకు వెళ్లి.. 75 లక్షలతో తిరిగొచ్చాడు.. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే..

|

Feb 06, 2022 | 9:37 PM

Viral News: అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది.. దురదృష్టం మాత్రం తలుపు తీసేంద వరకు తడుతూనే ఉంటుందని అంటారు. వచ్చిన అదృష్టాన్ని అందిపుచ్చుకున్నోళ్ల..

Viral News: లక్ అంట్ ఇతనిదే.. చికెట్ కోసం కొట్టుకు వెళ్లి.. 75 లక్షలతో తిరిగొచ్చాడు.. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే..
Lottery
Follow us on

Viral News: అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది.. దురదృష్టం మాత్రం తలుపు తీసేంద వరకు తడుతూనే ఉంటుందని అంటారు. వచ్చిన అదృష్టాన్ని అందిపుచ్చుకున్నోళ్ల జీవితమే మారిపోతుంది. తాజాగా ఓ వ్యక్తి విషయంలో ఇదే రుజువైంది. ఏదో చిన్న పని మీద బజారుకు వెళ్లిన వ్యక్తి.. ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు లక్షాదికారి అయి వెళ్లాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 75 లక్షల జాక్‌పాట్ కొట్టేశాడు. అవును మీరు చదివేది నిజంగా నిజం.

వివరాల్లోకెళితే.. అమెరికా మేరిల్యాండ్‌లోని హాగర్స్‌టౌన్‌లో నివసిస్తున్న 52 ఏళ్ల వ్యక్తిని తన భార్య చికెన్ తీసుకురమ్మని చికెన్ సెంటర్‌కు పంపింది. అయితే, మార్గమధ్యంలో తన లక్‌ను పరీక్షించుకుందాం అని భావించి ఒక లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. నిజంగా అతని టైమ్ సూపర్‌గా ఉందనే చెప్పాలి. అతనికి ఏకంగా 1 లక్షల డాలర్ల జాక్‌పాట్ తగిలింది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 75 లక్షలు. ఈ వ్యక్తి లాటరీ వెండింగ్ మెషీన్ నుంచి స్క్రాచ్ ఆఫ్ లాటరీ టికెన్‌ను 10 డాలర్లు(రూ.748) తో కొనుగోలు చేశఆడు. తర్వాత ఇంటికి వచ్చి డిన్నర్ చేసిన తరువాత తీరిగ్గా.. తాను కొన్న లాటరీ టికెట్‌ను స్క్రాచ్ చేశాడు. అంతే.. లక్ష డాలర్లు గెలుచుకున్నట్లు కనిపించింది. అంతమొత్తం డబ్బు గెలుచుకోవడంతో ఆ వ్యక్తి కుటుంబం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఒక్క రోజులో తన జీవితం హఠాత్తుగా ఇలా మలుపు తిరుగుతుందని తాను అనుకోలేదంటూ సంతోషం వ్యక్తం చేశాడు ఆ లక్కీ పర్సన్. తాను గెలిచిన డబ్బును అప్పు తీర్చడానికి, కుటుంబానికి ఉపయోగిస్తానని చెప్పాడు ఆ వ్యక్తి. ఇల్లు కట్టుకుంటానని, కొత్త టీవీని కొనుగోలు చేస్తానని, టూర్ వెళ్తానని సంతోషంలో తన కోరికలన్నీ వెలిబుచ్చాడు ఆ లక్కీ మ్యాన్.

Also read:

Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Andhra Pradesh: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..

Statue of Equality: సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న పవన్‌కల్యాణ్‌.. ఆయన మహాసంకల్పం వల్లే అంటూ..