Viral Video: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా చెట్టుపైనే సిట్టింగ్‌ వేసేశారుగా..!

సరదాగా ఫ్రెండ్స్ తో వీకెండ్‌లో ఎంజాయ్‌ చేద్దామనుకున్నవారు ఏ కల్లు కాంపౌండ్‌లోనో, బార్‌లోనో, లేదంటే ఏదైనా ప్రశాంతంగా ఉండే ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్‌ చేస్తారు. ఇంకొందరు ప్రకృతి ఒడిలో సేద తీరుతూ ఎంజాయ్ చేస్తారు. మద్యం ఇచ్చే కిక్ కోసం ఎంత అయినా వెచ్చిస్తారు. కానీ ఈ యువకులు భూమికి, ఆకాశానికి మధ్యలో సిట్టింగ్‌ వేశారు

Viral Video: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా చెట్టుపైనే సిట్టింగ్‌ వేసేశారుగా..!
Khammam Youth Idea
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 15, 2024 | 3:01 PM

సరదాగా ఫ్రెండ్స్ తో వీకెండ్‌లో ఎంజాయ్‌ చేద్దామనుకున్నవారు ఏ కల్లు కాంపౌండ్‌లోనో, బార్‌లోనో, లేదంటే ఏదైనా ప్రశాంతంగా ఉండే ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్‌ చేస్తారు. ఇంకొందరు ప్రకృతి ఒడిలో సేద తీరుతూ ఎంజాయ్ చేస్తారు. మద్యం ఇచ్చే కిక్ కోసం ఎంత అయినా వెచ్చిస్తారు. కానీ ఈ యువకులు భూమికి, ఆకాశానికి మధ్యలో సిట్టింగ్‌ వేశారు. ఇదేంటి… అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఈ సందేహం రావడం సహజమే. ఈ మందుబాబులు ఏకంగా తాటిచెట్టుపైనే మకాం పెట్టేశారు. చెట్టుపైన కూర్చుని హ్యాపీగా కల్లు తాగేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఎంచక్కా చెట్టెక్కి కూర్చుని వెదురు బొంగులతో కల్లు తాగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

దట్టమైన అడవి.. ప్రకృతి అందాలతో అలరారే భద్రాచలం మన్యంలో గిరిజనుల జీవన విధానం బహు గొప్పగా ఉంటుంది. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఉంటారు ఆదివాసీలు. వారి జీవన విధానంలో సురాపానం సేవించడం కూడా ఒక భాగమే. వేసవిలో పగలంతా కష్టపడి సాయంత్రం వేళ తాటి చెట్టు కల్లు తాగడం ఇక్కడ సర్వ సాధారణం. అయితే ఇక్కడి గిరిజన యువత వినూత్నంగా ఆలోచన చేశారు. తాటి చెట్టు కింద ఎవరైనా కల్లు తాగుతారు. అలా కాకుండా చెట్టు మీద ఉండే కల్లు సేవిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశారు. తమ ఆలోచనలకు పదును పెట్టారు. సుమారు 30 అడుగులు ఉండే వెదురు బొంగులతో పటిష్ఠమైన నిచ్చెన ఏర్పాటు చేసుకున్నారు. చెట్టుపైన ఒక బృందంగా కూర్చొని కల్లు సిట్టింగ్ వేసేందుకు కూడా ఉయ్యాల రూపంలో వెదురు బొంగులతోనే ఒక మంచే ఏర్పాటు చేసుకున్నారు.

ఆ నిచ్చెన ను చెట్టుకు కట్టారు. వెదురుతో దృఢంగా తయారు చేసిన ఉయ్యాల లాంటి దాన్ని తాటి చెట్టుపైన చుట్టూ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజూ తాటి గెలల నుంచి వచ్చే కల్లును ఆ ఊరి యువకులు నేరుగా చెట్టుపైనే కూర్చొని సేవిస్తున్నారు. చుట్టూ ఉన్న అడవి అందాలను చూస్తూ భూమికి 30 అడుగుల ఎత్తున ఉండి సురాపానం సేవించడాన్ని ఆ ఊరి వాళ్లంతా ఇప్పుడు పాటిస్తున్నారు. చెట్టుపై నుంచి కిందకి పడే ప్రమాదం ఉందని తెలిసినా రిస్కు తీసుకుంటున్నారు. తాటి చెట్టు పై వేసిన సిట్టింగ్ ఏర్పాట్లు.. అంత ఎత్తున వలయాకారంలో గిరిజనులు సామూహికంగా కల్లు సేవిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కేవలం వెదురుతో నిచ్చెన చెట్టుపై భాగంలో కల్లు కుండల చుట్టూ వెదురు బొంగులతో మంచె రూపంలో చేసిన సిట్టింగ్ ఏర్పాట్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసిన వారు ఆదివాసి యువకుల ఐడియాలను మెచ్చుకుంటున్నారు.

ఈ వీడియో మీరు చూసేయండి…

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…