Today Gold Rates in India: అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రోజు రోజుకు దారుణంగా పడిపోతోంది. ఫలితంగా దేశంలోని బంగారం ప్రియులకు పసిడి పంచ్‌లు విసురుతోంది. నన్ను కొనుగోలు చేసే దమ్ముందా అని ఛాలెంజ్ విసురుతున్నట్లుగా నానాటికి గోల్డ్ రేట్స్ ఆకాశం వైపు పరుగులు పెడుతున్నాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ఏకంగా రూ. 496 పెరిగింది. దాంతో నేడు దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల మేలిమి బంగారం(24 క్యారెట్లు) ధర రూ. 50,297కి చేరింది. ఇక ఆదివారం నాడు పది గ్రాముల గోల్డ్ రేట్ రూ. 49,801 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో చూసుకుంటే.. ఔన్స్ బంగారం ధర. 1,898 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Also read:
Silver Rates in India: ఒక్క రోజులో భారీగా పెరిగిన వెండి ధరలు.. కేజీ వెండి ధర ఏకంగా ఎంత పెరిగిందంటే..
Ayodhya Temple: విరాళాల పేరుతో ఎన్నికల ప్రచారం.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన శివసేన..