Motivation: ఉదయం లేవగానే ఈ పనులు చేయండి.. రోజంతా హ్యాపీగా ఉంటారు

ఉదయం నిద్రలేవగానే ఏం చేస్తారు..? ఏముంది ఠక్కన పక్కన ఉన్న ఫోన్‌ను తీసి అప్‌డేట్స్‌ చూస్తాం అంటారు కదూ! మీరు చెప్పకపోయినా మనలో చాలా మంది చేసేది ఇదే. ఇలా ఉదయం లేచిన వెంటనే స్మార్ట్‌ ఫోన్‌లో ఏదో ఒక స్టేటస్‌ చూస్తారు. అది మీ మనసును పాడు చేసేదే అవుతుంది. దీంతో దాని ప్రభావం ఆ రోజు మొత్తం పడుతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే మనం...

Motivation: ఉదయం లేవగానే ఈ పనులు చేయండి.. రోజంతా హ్యాపీగా ఉంటారు
Morning Motivation
Follow us

|

Updated on: Jul 26, 2024 | 8:07 AM

ఉదయం నిద్రలేవగానే ఏం చేస్తారు..? ఏముంది ఠక్కన పక్కన ఉన్న ఫోన్‌ను తీసి అప్‌డేట్స్‌ చూస్తాం అంటారు కదూ! మీరు చెప్పకపోయినా మనలో చాలా మంది చేసేది ఇదే. ఇలా ఉదయం లేచిన వెంటనే స్మార్ట్‌ ఫోన్‌లో ఏదో ఒక స్టేటస్‌ చూస్తారు. అది మీ మనసును పాడు చేసేదే అవుతుంది. దీంతో దాని ప్రభావం ఆ రోజు మొత్తం పడుతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే మనం ఏం చేస్తామన్న దానిపైనే మన రోజంతా ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. మానసిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని చెబుతుంటారు.

అందుకే ఉదయం నిద్ర లేచిన వెంటనే వీలైనంతవరకు సానుకూ దృక్పథంతో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఉదయం నిద్రలేచిన వెంటనే ఎలాంటి పనులు చేయాలి.? ఎలాంటి పనులు చేయకూడదు. రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* నిద్రలేచిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్‌ ఫోన్స్‌ను చెక్‌ చేయకూడదు. ముఖ్యంగా సోషల్‌ మీడియా జోలికి వెళ్లకూడదు. అందులోని కొన్ని అంశాలు మీ మనసును పాడు చేస్తాయి. అది మీపై రోజంతా ప్రభావం చూపుతుంది. ఉదయం లేచిన గంట వరకు స్మార్ట్ ఫోన్‌ జోలికి వెళ్లకుండా ఉండాలి. ఇందుకోసం స్మార్ట్‌ ఫోన్‌ను చేతికి అందకుండా దూరంగా ఉండేలా చూసుకోవాలి.

* ఇక కొందరు ఆలర్‌ పేరుతో పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చే రింగ్‌టోన్స్‌ను పెట్టుకుంటుంటారు. వీటివల్ల ఒక్కసారిగా గుండె దడ పెరిగే అవకాశాలు. కాబట్టి సున్నితంగా ఉండే లో సౌండ్‌ అలరమ్‌ టోన్స్‌ను సెట్ చేసుకోవాలి. వీటివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

* ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎవరితో గొడవ పడకూడదు. అది మీ రోజంతా ప్రభావం చూపుతుందని మర్చిపోకండి. రాత్రి ఎలాంటి గొడవలు జరిగినా ఉదయాన్నే మళ్లీ ఫ్రెష్‌గా రోజును ప్రారంభించాలి.

* మనసులో ఎలాంటి ఆందోళనలు, భయాలు ఉన్నా ఉదయాన్నే యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ఇది మనస్సుకు ఉత్తేజాన్ని ఇస్తుంది. అలాగే జీవక్రియను పెంచుతుంది.

* ఇక చాలా మందికి ఉదయం నిద్రలేవగానే న్యూస్‌ పేపర్లు, న్యూస్‌ ఛానల్స్ చూడడం అలవాటుగా ఉంటుంది. అయితే వీటిలో నేర సంబంధిత వార్తలు చదవడం వల్ల నెగిటివ్‌ ఆలోచనలు మొదలై దాని ప్రభావం రోజంతా ఉంటుంది. అందుకే మీ పనులు మొదలు పెట్టే వరకు ఇలాంటి అంశాలకు దూరంగా ఉండడం మంచిది.

* ఇంట్లో మొక్కలు ఉంటే కాసేపు వాటితో గడపాలి. వాటికి నీళ్లు పోయడం, ఏమైనా చెత్తాచెదారం లాంటివి ఉంటే క్లీన్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉల్లాసంగా ఉంటుంది. ఇక ఇంట్లో పెట్స్‌ ఉంటే వాటితో కాసేపు గడపాలి.

* అన్నింటికంటే ప్రధానమైంది సంగీతం. మనసును మార్చడంలో సంగీతం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదయం లేవగానే శ్రావ్యమై సంగీతం లేదా దేవుడి పాటలను వినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల రోజంతా పాజిటివ్‌ ఎనర్జీతో ఉంటారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!