మహేష్, రాజమౌళి సినిమా టైటిల్ ఇదే.. అద్దిరిపోయిందంతే

TV9 Telugu

25 July 2024

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి దీనిపై  అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  

అయితే మూవీ అనౌన్సుమెంట్  ఇచ్చేసారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ కూడా రివీల్ చేయలేదు.

 ఇక క్యాస్టింగ్ విషయంలోనూ కూడా అంతే. మహేష్ తప్ప మిగిలిన నటీ నటులు ఎవరై ఉంటారన్నది ఇప్పటి వరకు తేలలేదు.

కాగా ఆగష్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు ఉంది. మరి ఈ స్పెషల్ డే రోజునైనా ఎస్ఎస్ఎమ్ బీ 29 మూవీ గురించి ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో చూడాలి.

కాగా ఎస్ ఎస్ ఎమ్ బీ మూవీ టైటిల్ విషయంలో మాత్రం ఒక ఆసక్తికర బజ్ వినిపిస్తుంది. ఈ మూవీకి “గోల్డ్” అనే టైటిల్ ను పెడుతున్నట్లు సమాచారం.

సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో ఉంటుంది కాబట్టి ఈ యూనివర్సల్ టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేస్తారని సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తుంది. 

అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మహేష్ బర్త్ డే రోజైన ఈ సినిమాకు సంబంధించిన మూవీ అప్ డేట్ ఏమైనా వస్తుందేమో మరి.