సడన్ షాక్.! రఘుతాత తో ముహూర్తం ఫిక్స్ చేసిన కీర్తీ సురేష్‌. 

Anil Kumar

26 July 2024

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కీర్తిసురేష్ తొలి సినిమాతోనే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

ఆ తర్వాత మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉంది.

ఈ మధ్యే గ్లామర్ షో కు తెర తీసిన కీర్తీ సురేష్‌.. రోజు రోజుకీ అందాల ఆరబోతలో మరింత రెచ్చిపోతున్నారని టాక్.

నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా లోనే అనుకుంటే.. తాజాగా పబ్లిక్ ఈవెంట్స్‌లోనూ రప్ఫాడిస్తున్నారు కీర్తి.

తాజాగా ఈ ముద్దుగుమ్మ కీర్తీ సురేష్‌ నటిస్తున్న 'రఘుతాత' సినిమా ఆగస్టు 15న గ్రాండ్ గా విడుదల కానుంది.!

ఈ సినిమా హిందీ భాషకు వ్యతిరేకంగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోందని అన్నారు డైరక్టర్‌ సుమన్‌ కుమార్‌.

వినోదంతో కూడిన ఓ కుటుంబ కథా చిత్రమని అన్నారు. ఇది అందరికి తప్పకుండా నచ్చుతుందని చెప్పుకొచ్చారు కీర్తీ.

హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకిస్తూ తెరకెక్కిన చిత్రమని చెప్పారు కీర్తీ సురేష్‌.