ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందే మరో క్రేజీ ఆఫర్ అందుకున్న బ్యూటీ.. 

Rajeev 

25 July 2024

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న నయా మూవీ మిస్టర్ బచ్చన్. ఈ సినిమా భాగ్య శ్రీ హీరోయిన్ గా చేస్తుంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే భాగ్యశ్రీ లుక్స్ కూడా మెప్పిస్తున్నాయి.

హీరోయిన్ అదిరిపోయింది అంటూ కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ సాంగ్స్ తో ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరుగుతోంది.

ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత భాగ్య శ్రీ పేరు టాలీవుడ్ లో గట్టిగానే వినిపించేలా కనిపిస్తుంది.

ఇప్పటికే ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలో ఈమెను ఫిక్స్ చేశారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ చేస్తున్న సినిమాలో ముందు శ్రీలీల అనుకున్నారు కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి భాగ్యశ్రీ వచింది.

విజయ్ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా చేస్తుందన్న అప్డేట్ ను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారని టాక్.