రొమాంటిక్ సీన్స్ కు వచ్చిన అంత ఇంపార్టెన్స్ ఇంతకు ముందు రాలేదు: అంజలి

Anil Kumar

25 July 2024

తెలుగుఅమ్మాయి అంజలి హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. సెకండ్ ఇన్నింగ్ లో మరింత స్పీడ్ లో ఉంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ., అస్సలు గ్యాప్ లేకుండా.. విభిన్న పాత్రలతో అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

హీరోయిన్ గానే కాదు.. గెస్ట్ రోల్స్ లోనూ, కీ రోల్స్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ బ్యూటీ.

తాజాగా మీడియా ముందు మాట్లాడుతూ.. అంజలి తన సినీ కెరియర్ లో ఆకట్టుకున్న ఒక పాత్ర గురించి చెప్పుకొచ్చింది.

గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి సినిమాలో తాను చేసిన కేరక్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చిందని అన్నారు నటి అంజలి.

తన ఇప్పటి వరకు చేసిన రోల్స్ కి కెరీర్‌లో ఇప్పటిదాకా అన్ని కాల్స్, అన్ని మెసేజ్‌లు ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా.. సినిమాలోని క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ చేసే పాత్రలు నచ్చుతాయి అని..

అలాంటి పాత్రలు ప్రేక్షకులకు కనెక్ట్ అయినప్పుడు మరింత ఆనందంగా అనిపిస్తుందని చెప్పారు వయ్యారిభామ అంజలి.