Pista: సమ్మర్‌లో పిస్తా తింటే ప్రమాదమా.? నిపుణులు ఏమంటున్నారంటే..

అందుకే వైద్యులు సైతం పిస్తాను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే అతి ఎప్పుడూ అనర్థమే అన్నట్లు పిస్తాను అధికంగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు కూడా తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పిస్తాను తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయేమో ఇప్పుడు తెలుసుకుందాం.. పిస్తా ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో...

Pista: సమ్మర్‌లో పిస్తా తింటే ప్రమాదమా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Pista
Follow us

|

Updated on: May 10, 2024 | 8:02 PM

పిస్తా ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్, యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, విటమిన్ బి6, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. దీంతో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. పిస్తపప్పు తీసుకోవడం వల్ల శరీరంలో అలసట, బలహీనత తొలగిపోతాయి.

అందుకే వైద్యులు సైతం పిస్తాను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే అతి ఎప్పుడూ అనర్థమే అన్నట్లు పిస్తాను అధికంగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు కూడా తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పిస్తాను తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయేమో ఇప్పుడు తెలుసుకుందాం.. పిస్తా ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అదే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా సమ్మర్‌లో పిస్తా తీసుకోవడం వల్ల శరీరం వేడికి గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పిస్తాను అధికంగా తీసుకుంటే శరీరం వేడి చేస్తుందని అంటున్నారు. అయితే మితంగా తీసుకుంటే మాత్రం ఎలాంటి సమస్య ఉండదు. ఇక మరికొందరిలో పిస్తాను అధికంగా తీసుకోవడం వల్ల ఎలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా పిస్తా ఎక్కువగా తీసుకోకూడదని చెబుతున్నారు. దీనివల్ల డయేరియా వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కిడ్నీలో రాళ్లు ఉన్న వారు కూడా పిస్తాకు దూరంగా ఉంచడాలి. పిస్తాలో ఆక్సలేట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతాయి. బరువు తగ్గాలనుకునే వారు కూడా పిస్తాలు అధికంగా తీసుకోకూడదు. ఇందులోని అధిక కేలరీలు స్థూలకాయానికి దారి తీస్తుందని అంటున్నారు. ఏదైనా అనారోగ్య సమస్యల కోసం మందులు వాడుతున్న వారు కూడా పిస్తాకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రియాక్షన్‌ అయ్యే అవకాశం ఉంటుదని అంటున్నారు. అందుకే పిస్తాకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ