Optical Illusion: ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టగలరా? 10 సెకన్లలో ఆన్సర్ చెప్తే మీరే కిర్రాక్..

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేవి మన కళ్లను ఎప్పటికప్పుడు మోసం చేస్తుంటాయి. అందులోని రహస్యం ఒకటయితే..

Optical Illusion: ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టగలరా? 10 సెకన్లలో ఆన్సర్ చెప్తే మీరే కిర్రాక్..
Snake Optical Illusion

Updated on: Dec 05, 2022 | 7:09 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేవి మన కళ్లను ఎప్పటికప్పుడు మోసం చేస్తుంటాయి. అందులోని రహస్యం ఒకటయితే.. మనకు కనిపించేది మరొకటి. ఇలా మన బుర్రను తికమక పెట్టేస్తాయి. మరి మీకు ఇలాంటి ఫోటో పజిల్స్ ఇష్టమైతే.. ఓ పట్టు పట్టేద్దాం పదండి. ఈరోజుల్లో ఇంటర్నెట్‌లో నెటిజన్ల సామర్ధ్యాలను పరీక్షించేందుకు, వారి స్వభావం, వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేసేలా పలు ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటివి ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఓ ఫోటో పజిల్‌ను మీ ముందుకు తీసుకొచ్చేశాం.

పైన పేర్కొన్న ఫోటో చూస్తుంటే.. మీకేం కనిపిస్తోంది. ఠక్కున అందరూ అటవీ ప్రాంతం అని అంటారు. అవును కరెక్టే.. అది ఒక ఇంటికి సంబంధించిన బ్యాక్‌యార్డ్. అది కూడా ఫారెస్ట్‌లో ఉంది కాబట్టి మీకు అటవీ ప్రాంతంలా కనిపిస్తుంది. ఇక ఆ చోట ఓ విషపూరితమైన పాము దాగుంది. అదెక్కడుందో మీరు గుర్తించాలి. సరిగ్గా 10 సెకన్లలో కనిపెడితే.. మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లే.. మరి లేట్ ఎందుకు ఫస్ట్ అటెంప్ట్‌లో ప్రయత్నించండి. ఒకవేళ ఎంత వెతికినా దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఫోటో చూడండి.