Telangana: అమానుషం.. అంత్యక్రియలకు హాజరు కాని కులస్తులు.. మృతదేహం చేసిన తప్పేంటి..?

| Edited By: Balaraju Goud

Aug 21, 2024 | 3:04 PM

ఒక వైపు మనిషి చంద్రుని మీద కాలు మోపేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, కొందరు మాత్రం తమ ఉనికిని కాపాడుకునేందుకు కులం, మతం పేరుతో గ్రామాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. ఆటవిక చర్యలతో మరింత దిగజారుతున్నారు.

Telangana: అమానుషం.. అంత్యక్రియలకు హాజరు కాని కులస్తులు.. మృతదేహం చేసిన తప్పేంటి..?
Funeral Rituals
Follow us on

ఒక వైపు మనిషి చంద్రుని మీద కాలు మోపేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, కొందరు మాత్రం తమ ఉనికిని కాపాడుకునేందుకు కులం, మతం పేరుతో గ్రామాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. ఆటవిక చర్యలతో మరింత దిగజారుతున్నారు. ఇలాంటి ఘటనలు చేసిన వారి పై కేసులు నమోదు అవుతున్న కొంత మందిలో మాత్రం మార్పు రావడం లేదు. కుల బహిష్కరణలు బతికి ఉన్నవారికే కాదు. చనిపోయిన శవాలకు కూడా వర్తింపజేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

అక్బర్ పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బండమీది సాయిలు అనే వ్యక్తి
అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు అతని కులస్తులు ఎవరు ముందుకు రాలేదు. సాయిలు అనే వ్యక్తికి 5 ఎకరాలు పొలాన్ని సాగు చేసుకుంటున్నాడు. అందులో నుండి మూడు గంటలు భూమి విషయంలో నెల రోజుల క్రితం ఇరుగు పొరుగు వారితో గొడవ జరిగింది. ఇది కాస్తా, కుల పెద్దల వరకు వెళ్లింది. ఆ భూమి విషయంలో కులస్తులతో గొడవ జరిగింది. దాంతో సాయిలు కుటుంబాన్ని కుల బహిష్కరణ విధించారు.

అప్పటి నుండి సాయిలు ఇంటికి కులస్తులు ఎవరు రావడం లేదు. మాట్లాడం లేదు. అయితే ఇటీవల సాయిలు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురైన సాయిలు మంగళవారం(ఆగస్ట్20) మధ్యాహ్నం మృతి చెందాడు. కాగా ఆయన మృతదేహాన్ని చూడడానికి కూడా కులస్తులు ఎవరు రాలేదు. ఆయన అంత్యక్రియల్లో ఎవరు పాల్గొవద్దని కులస్తులు తీర్మానం చేశారు. బహిష్కరణ అయినా ఇంటి దగ్గరకి ఎవరు వెళ్లిన, వారితో మాట్లాడిన 5వేల రూపాయల జరిమానా వేస్తామని కుల పెద్దలు తేల్చి చెప్పడంతో ఎవరు కూడా అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చివరికి కుటుంబసభ్యులు మాత్రమే సాయిలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాగా, కుల బహిష్కరణ పేరుతో వేధిస్తున్నారని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..