Viral Video: అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది నాగమ్మా..?

పాముల వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటాయి. కొన్ని భయపెడతాయి… కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ ఈసారి వైరల్ అవుతున్న పాము వీడియో… గుండె ద్రవించేలా ఉంది. ఓ నిస్సహాయ జీవి బాధ ఈ కథనం కళ్లకు కడుతుంది. డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

Viral Video: అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది నాగమ్మా..?
Snake

Updated on: Jul 15, 2025 | 7:09 PM

సోషల్ మీడియాలో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అవి చాలావరకు భీతిగొల్పేలా ఉంటాయి. అయితే ఈ పాము వీడియో చూస్తే మాత్రం మీ మనసు చివిక్కుమంటుంది. తలపై ప్లాస్టిక్ బాటిల్ మూత ఇరుక్కుపోవడంతో ఓ పాము తీవ్రంగా బాధపడుతున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఈ వీడియో వన్య ప్రాణి ప్రేమికులనే కాకుండా.. సామాన్యులకు కూడా బాద కలిగిస్తుంది.

పాము తల బలంగా ఒక బాటిల్ క్యాప్ ఇరుక్కుపోయినట్టు స్పష్టమవుతుంది. దాంతో దానికి దిక్కుతోచక తిరుగుతూ, ఎటుపోతున్నామో తెలియక తడబడుతూ కనబడింది. మార్గం కనిపించకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఆ పాము శరీర కదలికల ద్వారా స్పష్టమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులకు మనుషులే కారణం అని కూడా గుర్తించాలి. అడవుల్లో, కాలువలలో, రోడ్ల పక్కన ప్లాస్టిక్, ఇతర వేస్తే విసిరేయడం అమాయక జీవుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ప్లాస్టిక్ వాడకం కేవలం మనకే కాదు, మిగిలిన జీవులకు కూడా ముప్పే” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. అంటూ వ్యాఖ్యలు పెడుతున్నారు. చెత్త నిర్వహణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు… ప్రతిఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని మరొకరు వ్యాఖ్యానించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. వాటిని రీసైకిల్ చేయాలి.
నింగి, నీరు, ఈ నేల అందరిదీ అని గుర్తెరిగి బాధ్యతగా నడుచుకోవాలి.

వీడియో దిగువన చూడండి…

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..