Interesting facts: పాల రంగు ఎందుకు తెల్లగా ఉంటుంది? ఎరుపు, నీలంలో ఎందుకుండదు..! ఎందుకంటే..

|

Apr 25, 2023 | 8:54 PM

ఈ భూమిపై బిడ్డకు జన్మనివ్వగల అన్ని జీవుల పాల రంగు తెల్లగానే ఉంటుంది. ఈ జీవుల్లో మనిషి కూడా ఒకరు. అయితే ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? శరీరంలో ఉండే కొన్ని రసాయనాల వల్ల పాలు తెల్లగా ఉంటాయి. నిజానికి పాలు తెల్లగా ఉండటానికి ..

Interesting facts: పాల రంగు ఎందుకు తెల్లగా ఉంటుంది? ఎరుపు, నీలంలో ఎందుకుండదు..! ఎందుకంటే..
Follow us on

ఆవులు, గేదెలు ప్రతిరోజూ పచ్చి గడ్డిని తింటాయి. వాటి శరీరంలో ప్రవహించే రక్తం ఎర్రగా ఉంటుంది. కానీ, అవిచ్చే పాలు మాత్రం తెల్లగా ఉంటాయి. పాలు ఎందుకు తెల్లగా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి మాత్రమే కాదు, ఈ భూమిపై బిడ్డకు జన్మనివ్వగల అన్ని జీవుల పాల రంగు తెల్లగానే ఉంటుంది. ఈ జీవుల్లో మనిషి కూడా ఒకరు. అయితే ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? శరీరంలో ఉండే కొన్ని రసాయనాల వల్ల పాలు తెల్లగా ఉంటాయి. నిజానికి పాలు తెల్లగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో వైట్ కలర్ కేసైన్ ఉంటుంది. పాలలోని ప్రధాన ప్రోటీన్లలో కేసైన్ ఒకటి. కాసిన్ పాలలో కాల్షియం, ఫాస్ఫేట్‌తో మైకెల్స్ అనే చిన్న కణాలను ఏర్పరుస్తుంది. ఈ మైకెల్‌పై కాంతి పడినప్పుడు, అది వక్రీభవనం చెందుతుంది. దీంతో పాలు తెల్లగా కనిపిస్తాయి. అంతే కాకుండా పాలలోని కొవ్వు కూడా తెలుపు రంగుకు కారణం.

ఆవు పాలు ఎందుకు లేత పసుపు రంగులో ఉంటాయి?

మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా గమనిస్తే, గేదెతో పోలిస్తే ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో కనిపిస్తాయి. ఆవు పాలు గేదె పాల కంటే తేలికైనవి. తక్కువ కొవ్వు పదార్ధాలను కలిగి ఉంటాయి. దానిలోని కేసైన్ పరిమాణం కూడా తగ్గుతుంది. దీని కారణంగా ఆవు పాలు లేత పసుపు రంగులో కనిపిస్తాయి. ఎందుకంటే పాలలో ప్రొటీన్లు, కొవ్వులు, లాక్టోస్, కార్బోహైడ్రేట్లు, కాల్షియంతోపాటు విటమిన్లు, ఫాస్పరస్, ఇతర పదార్థాలు ఉంటాయి. ఆవు పాలలో బీటా కెరోటిన్‌ అనే పదార్థం కొంత ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే ఆ పాలు లేత పసుపు రంగులో ఉంటాయి. అదే గేదె పాలలో ఆ పదార్థం లేకపోవడం వల్ల పాలు తెల్లగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..