viral video: రెప్పపాటులో ప్రమాదం..కానిస్టేబుల్‌ చాకచక్యంతో తృటిలో తప్పిన ముప్పు

|

Jul 02, 2021 | 11:28 AM

ప్రమాదాలు చిటికెలో జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఏం జరుగుతుందో చెప్పలేం...  ఎప్పుడు ఎటునుంచి ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవ్వరూ చెప్పలేం. మరి ముఖ్యంగా కదులుతోన్న ట్రైన్‌లో ఎక్కడం చాలా ప్రమాదకరం..

viral video: రెప్పపాటులో ప్రమాదం..కానిస్టేబుల్‌ చాకచక్యంతో తృటిలో తప్పిన ముప్పు
Running Train
Follow us on

viral video: ప్రమాదాలు చిటికెలో జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఏం జరుగుతుందో చెప్పలేం…  ఎప్పుడు ఎటునుంచి ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవ్వరూ చెప్పలేం. మరి ముఖ్యంగా కదులుతోన్న ట్రైన్‌లో ఎక్కడం చాలా ప్రమాదకరం.. అలాగే దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.. ఏ మాత్రం పొరపాటు జరిగిన అంతే సంగతులు. భూమ్మీద నూకలుంటే తప్ప ఇలాంటి ప్రమాదాల నుంచి బ్రతికి బయటపడలేం. తాజాగా ఓ వ్యక్తి ప్రమాదం అంచుల వరకు వెళ్లి వచ్చాడు. వేగంగా కదులుతున్న ట్రైన్‌ను ఎక్కేందకు ప్రయత్నిస్తూ, కిందపడిపోయాడు.
అప్పటికే ట్రైన్‌ వేగంగా వెళ్తుండటంతో పట్టుతప్పి కిందపడి ఆ ట్రైన్‌ కిందకు వెళ్లబోయాడు ప్రయాణికుడు. ఓ కాలు ఫ్లాట్‌ఫామ్‌ కింద, మరో కాలు ఫ్లాట్‌ఫామ్‌పైన పడిపోయి అలాగే ఉండిపోయాడు.వెంటనే ఆ ప్రయాణికుడిని గమనించిన ఓ ఆర్ఫీఎఫ్‌ కానిస్టేబుల్‌, అతడిని సాహసోతపేతంగా కాపాడాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని పక్కకు లాగేసాడు. దాంతో అతడి ప్రాణాలు నిలిచాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఎంతో సాహసోపేతంగా ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ను అందరూ ప్రశంసిస్తూ, శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇది ముంబైలోని బోరివాలి రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒళ్ళు గగుర్లు పొడిచే ఈ వీడియోను మీరూ వీక్షించండి.

మరిన్ని ఇక్కడ చదవంది :

Samsung Galaxy F22 : జూలై 6న లాంచ్ అవుతున్న ‘శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 22’.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు..

Twitter Down : ట్విట్టర్ సేవలకు అంతరాయం.. సరిగా పనిచేయడం లేదని వినియోగదారుల ఆందోళన..

Google: గూగుల్‌కు 27,700 ఫిర్యాదులు.. 59వేల కంటెంట్ల తొలగింపు.. నెలవారీ నివేదిక విడుదల