Marriage: పెళ్లికి ముందు ప్రతి అమ్మాయి తన భాగస్వామిని ఈ 3 విషయాలు తప్పక అడగాలి.. అవేంటంటే..

|

Dec 05, 2021 | 6:04 AM

Marriage: ఏ అమ్మాయికైనా పెళ్లి అనేది పెద్ద నిర్ణయం. పెళ్లయ్యాక పుట్టింటిని వదిలి కొత్త కుటుంబాన్ని, కొత్త సంస్కృతిని అలవర్చుకోవడం ఆడపిల్లకు సాధారణం. ఈ నేపథ్యంలో అమ్మాయి..

Marriage: పెళ్లికి ముందు ప్రతి అమ్మాయి తన భాగస్వామిని ఈ 3 విషయాలు తప్పక అడగాలి.. అవేంటంటే..
Marriage
Follow us on

Marriage: ఏ అమ్మాయికైనా పెళ్లి అనేది పెద్ద నిర్ణయం. పెళ్లయ్యాక పుట్టింటిని వదిలి కొత్త కుటుంబాన్ని, కొత్త సంస్కృతిని అలవర్చుకోవడం ఆడపిల్లకు సాధారణం. ఈ నేపథ్యంలో అమ్మాయి తనకు సరైన భాగస్వామిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. భాగస్వామి సహకారంతో జీవితాన్ని రాణించడం మరింత సులభం అవుతుంది. అయితే, ఈ విషయంలో పెళ్లికి ముందు అమ్మాయి తన కాబోయే భాగస్వామితో కొన్ని విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడటం చాలా ముఖ్యం. ఎందుకంటే పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు అయినా ఉండొచ్చు. ఆ పరిస్థితులను సర్దుబాటు చేసుకోవడం అంత సులభం కాకపోవచ్చు. తద్వారా ఘర్షణలు, వాగ్వాదాలు చోటు చేసుకోవచ్చు. ఈ విషయాలను ముందుగానే క్లియర్ చేసుకుంటే.. భవిష్యత్తులో ఇవేమీ మీకు ఇబ్బందిగా పరిణమించవు. వైవాహిక జీవితంలో తరచూ గొడవలకు కారణమయ్యే మూడు ముఖ్యమైన విషయాల గురించి ఇక్కడ తెలుసుకోండి. అలాగే వాటి గురించి ముందుగానే మీ భాగస్వామితో మాట్లాడుకోవడం తెలివైన పని..

ఆర్థిక పరిస్థితి..
పెళ్లికి ముందు అబ్బాయితో అతని ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడటం విచిత్రంగా అనిపిస్తుంది. కానీ, ఇక్కడ మీరు ఆచరణాత్మకంగా ఆలోచించాలి. ఫైనాన్స్ గురించి మాట్లాడటం అంటే మీరు డబ్బుపై అత్యాశతో ఉన్నారని కాదు. డబ్బు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఆర్థిక స్థితి గురించి చర్చించడం ద్వారా వివాహం తర్వాత భాగస్వామి మీ అవసరాలను తీర్చగలరో లేదో ఒక అవగాహనకు రావొచ్చు. ఒకవేళ మీరు కూడా పని చేస్తున్నట్లయితే.. ఇద్దరూ కలిసి ఇంటి ఖర్చులను నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ అంశంపైనా ఇద్దరూ కూలంకశంగా చర్చించుకోవడం ఉత్తమం. ఎందుకంటే పెళ్లి తరువాత ఆర్థిక పరమైన వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఇది ఉపకరిస్తుంది.

నివాస స్థలం..
మహిళలు పని చేస్తున్నట్లయితే, ఈ సమస్య చాలా కీలకమైనది. ఎందుకంటే.. మీరు మీ కార్యాలయానికి/ఆఫీసుకి చేరువగా ఉండే నివాసం అవసరం. పని చేసే అమ్మాయి పెళ్లి తరువాత ఇల్లు, ఉద్యోగం రెండూ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సమస్య గురించి ముందుగానే మాట్లాడుకోవడం ఉత్తమం. ఆఫీసుకు దగ్గర్లో ఇల్లు తీసుకోవడం వంటి సమస్యలు క్లియర్ అవుతాయి.

కుటుంబంతో ఉండాలా? విడిగా ఉండాలా?
మీరు మీ తల్లిదండ్రులతో ఉంటారా? లేక కొత్త ఇల్లు తీసుకుంటారా? అని మీ భాగస్వామిని అడగాలి. ఇది అడగడానికి ఇబ్బందిగా అనిపించినా చాలా ఇళ్లలో ఈ విషయంపై గొడవలు జరుగడం తరచుగా చూస్తూనే ఉన్నాం. కుటుంబంతో సర్దుకుపోలేకపోతే ముందుగా మాట్లాడుకోవడం మంచిది. అంతేకాకుండా.. వివాహం తర్వాత ప్రారంభంలో ప్రైవసీ కూడా అవసరం. ఈ నేపథ్యంలో మీరు ఏమనుకుంటున్నారో దాని గురించి ముందుగానే అబ్బాయికి చెప్పండి. అతని అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి. ఈ సమస్యపై మాట్లాడటం వలన భవిష్యత్తులో ఒకరినొకరు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.

Also read:

Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..

Cryptocurrency: భారీ క్రిప్టోకరెన్సీ చోరీ.. సైబర్ దాడితో హ్యాకర్లు చేసిన పని.. ఎన్ని క్రిప్టో టోకెన్‌లను దొంగిలించారంటే..

Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం