
పాలసీ తీసుకున్న 8,12,16 ఏళ్లల్లో మీకు 1.4-1.4 లక్షల రూపాయల చొప్పున మనీ బ్యాక్ లభిస్తుంది. 20వ సంవత్సరంలో రూ.2.8 లక్షలు లభిస్తాయి. వెయ్యికి ఏడాదికి రూ.48 బోనస్ లభిస్తుంది. ఈ విధంగా రూ.7లక్షల మొత్తానికి వార్షిక బోనస్ రూ.33600. 20 ఏళ్లలో ఇది రూ.6.72 లక్షలు అవుతుంది. 20 ఏళ్లల్లో మొత్తం రూ.13.72 లక్షలు లభిస్తాయి. అయితే ఇందులో మొత్తం రూ.4.2 లక్షలలను మనీబ్యాక్ రూపంలో పొందవచ్చు.


National Savings Certificate పథకంలో రూ.లక్ష పెట్టబడి పెడితే.. 40 వేల వడ్డీ వస్తుంది. ఈ పథకం కాలవ్యవధి 5 సంవత్సరాలు. కనీసం 100 నుంచి 1000 వరకు జమచేసుకోవచ్చు లేదా.. ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ పథకంపై పోస్టల్ శాఖ 6.8 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ వడ్డీని వార్షిక ప్రాతిపదికన లెక్కించి.. మెచ్యూరిటీపై వడ్డీని చెల్లిస్తారు. దీని కింద మీరు 1000 రూపాయలు పెట్టుబడి పెడితే ఐదేళ్ల తర్వాత మీ మొత్తం 1389.49 రూపాయలు అవుతుంది. అంటే వడ్డీ ఆదాయం రూ .389.49.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం పోస్టాఫీసులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 18 ఏళ్లపైన వారు.. లేదా మైనర్లు ఉంటే.. ముగ్గురు కలిసి ఉమ్మడి ఖాతాను తెరవచ్చు. మరిన్ని వివరాల కోసం మీ దగ్గర్లోని పోస్టాఫీసులో సంప్రదించండి.