వాస్తు శాస్త్రంలో ఏ వస్తువును ఏ దిశలో ఉంచాలో వివరంగా చెప్పబడింది. ఇంట్లో వాస్తు ప్రకారం వస్తువులు పెడితే ఆ ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఇంట్లో అద్దం ఏ దిశలో పెట్టాలో కూడా వాస్తులో చెప్పబడింది. అద్దాన్ని సరైన స్థానంలో పెట్టకపోతే ఇంట్లో ప్రతికూలత రావొచ్చు. వాస్తు శాస్త్రంలో అద్దానికి సంబంధించి చాలా నియమాలు ఉన్నాయని, ఈ నియమాలు పాటిస్తే అదృష్టం వరిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో అద్దాలను అమర్చుకునేటప్పుడు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి..అవేంటంటే..
ఇంట్లో అద్దాలను అమర్చేటప్పుడు, రెండు అద్దాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదు. రెండు అద్దాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంటే ఇంటి శాంతికి భంగం కలుగుతుందని చెబుతారు. అలాగే, వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో కూడా అద్దం పెట్టకూడదు. అందులోనూ మంచం అద్దానికి కనిపించకూడదు.. ఏ ఇంట్లోనైనా భార్యాభర్తలు పడుకునే మంచం అద్దంలో కనిపిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. స్థలభావం వల్ల అద్దాన్ని అక్కడి నుంచి తీయలేకపోతే పడుకునేటప్పుడు అద్దాన్ని గుడ్డతో కప్పి ఉంచండి.
అలాగే, ఇంట్లో ఎప్పుడూ పగిలిన అద్దం ఉండకూడదని గుర్తుంచుకోండి. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచడం అశుభం అంటారు. ఉదయం లేవగానే పగిలిన అద్దం కనిపిస్తే రోజంతా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి వంటగదిలో కూడా అద్దం పెట్టకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ఇంటి ఈ స్థలంలో అద్దం పెట్టండి :
ఇల్లు లేదా ఆఫీసు ప్రధాన ద్వారం మీద తూర్పు దిశలో అద్దం పెట్టడం మంచిది. ఈ ప్రదేశంలో ఉంచిన అద్దం ఉదయించే సూర్యుడిని సూచిస్తుంది.ఈశాన్య గోడపై అమర్చిన అద్దం పురోగతిని తెస్తుంది.
Note: (వాస్తు వివరాలు, రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.)
మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..