MLA Kotamreddy: అంధురాలికి సొంత ఖర్చులతో ఆపరేషన్.. మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

|

Apr 25, 2022 | 3:47 PM

సాధారణంగా రాజకీయ నేతలు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు అంటారు. కానీ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మాత్రం ఓ అంధురాలికి ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న సమయానికి కంటే ముందుగానే సహాయం చేసి నిరూపించుకున్నారు

MLA Kotamreddy: అంధురాలికి సొంత ఖర్చులతో ఆపరేషన్.. మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి
Mla Kotamreddy
Follow us on

MLA Kotamreddy Humanity: సాధారణంగా రాజకీయ నేతలు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు అంటారు. కానీ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మాత్రం ఓ అంధురాలికి ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న సమయానికి కంటే ముందుగానే సహాయం చేసి నిరూపించుకున్నారు. సొంత ఖర్చులతో కేవలం 24 గంటల్లోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇంతకీ మాట ఇచ్చిన 24 గంటల్లోనే ఆ మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ఎవరు. అంధురాలికి ఆ ఎమ్మెల్యే ఇచ్చిన మాట ఏంటో ఒకసారి చూద్దాం.

ఎప్పుడు వార్తల్లో ఉండే నెల్లూరు రూరల్ వైసిపి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఓ అంధురాలికి చూపు తేపిస్తాను అని ఇచ్చిన మాటను 24 గంటల్లోనే నిజం చేశారు. సొంత ఖర్చులతో ఆ యువతికి ఆపరేషన్ చేయించి చూపు తెప్పించి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నేతగా గుర్తుండిపోయారు. నెల్లూరు రూరల్‌లో గడప గడపకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యక్రమం చేస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి.. గత వారం రోజుల క్రితం నెల్లూరు రూరల్ పరిధిలోని పాత వెల్లంటిలో పర్యటించారు. ఇదే సందర్భంలో ఓ ఇంటికి వెళ్లగా ఎమ్మెల్యే వచ్చారని తెలుసుకున్న పైరపోగు కామాక్షి అనే యువతి ఇంటిలో నుంచి బయటకు వచ్చింది. వచ్చిన వెంటనే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి తనకు ఓ మాట ఇవ్వాలని కోరడంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి క్షణం ఆలోచించకుండా సరే అని చెప్పేశారు.

తానూ పుట్టుకతోనే కంటి చూపు లేదని ఆపరేషన్ చేస్తే.. మళ్లీ చూపు వస్తుందని వైద్యులు చెప్పారన్నారు. అయితే, ఆపరేషన్ కు అవసరమైన ఆర్ధిక స్తోమత తమకు లేదని తనకు ఆపరేషన్ చేయించి కంటి చూపు తెప్పించాలని ఎమ్మెల్యేను వేడుకుంది. దీంతో కామాక్షి పరిస్థితి పూర్తిగా తెలుసుకున్న ఎమ్మెల్యే కచ్చితంగా ఆపరేషన్ చేయిస్తానని మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రూరల్ పరిధిలోని పాత వెల్లంటి లో కామాక్షి అనే అంధురాలికి ఆపరేషన్ చేయిస్తానని చెప్పి వెళ్లిన ఎమ్మెల్యే పై అక్కడ చుట్టు ప్రక్కల వారికి నమ్మకం కలగక పొగ రాజకీయ నాయకులు మాట నిలబెట్టుకోరు అని ఆ అంధురాలికి చెప్పారు. దీంతో ఆ యువతి నిరాశ చెందింది.

అయితే, మాట ఇచ్చి వెళ్లిపోయిన 24 గంటల్లోనే ఎమ్మెల్యే వ్యక్తి గత సిబ్బంది గ్రామానికి చేరుకుని అంధురాలైన కామాక్షిని నగరంలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కి తరలించి టెస్ట్ లు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం అపరేషన్ చేయిస్తే చూపు వస్తుందని, అయితే తొలుత ఒక కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే సొంత ఖర్చులతో కామాక్షికి ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కామాక్షి మరో రెండు రోజుల్లో కంటిచూపుతో ఈ రంగుల లోకాన్ని చూడనున్నట్లు వైద్యులు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

— మురళి, టీవీ 9 తెలుగు ప్రతినిధి, నెల్లూరు జిల్లా.

Read Also…  Success Story: ఫలితవివ్వని ఉద్యోగ వేట.. రూ.30వేల పెట్టుబడితో జీవితాన్ని అందంగా మలుచుకున్న ఆదర్శ యువతి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం…