Milestones: మీరు ఎప్పుడైనా మైలురాళ్లకు ఉండే రంగులను గమనించారా..? వాటి అర్థం ఏమిటో తెలుసుకోండి!

Milestones Colours Meaning: మీరు సాధారణంగా రోడ్డు వెంట ప్రయాణం చేస్తున్నప్పుడు కిలోమీటర్ల దూరాన్ని తెలిపై మైలు రాళ్లను చూసి ఉంటారు. దానిపై ఊరి పేరు,..

Milestones: మీరు ఎప్పుడైనా మైలురాళ్లకు ఉండే రంగులను గమనించారా..? వాటి అర్థం ఏమిటో తెలుసుకోండి!
Milestones Colours Meaning

Updated on: Jun 28, 2022 | 9:57 AM

Milestones Colours Meaning: మీరు సాధారణంగా రోడ్డు వెంట ప్రయాణం చేస్తున్నప్పుడు కిలోమీటర్ల దూరాన్ని తెలిపై మైలు రాళ్లను చూసి ఉంటారు. దానిపై ఊరి పేరు, వచ్చే గ్రామం ఇంకా ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో చెబుతుంది. ఇందులో ఇంకో విషయం ఏంటంటే మైలు రాళ్లు వివిధ రకాల రంగుల్లో ఏర్పాటు చేసి ఉంటాయి. మరి ఇలా మైలు రాయిలకు వివిధ రంగులు ఎందుకు ఉంటాయో మీరెప్పుడైన గమనించారా..? గమనించి ఉండరు. అందుకే వాటి గురించి మీకు చెప్పబోతున్నాము. ఈ రంగులను బట్టి అర్థాలు ఉంటాయి.

మైలురాయి రంగులు రెండు రంగుల్లో ఉంటాయి. సగానికి పైగా తెలుపురంగు ఉంటే, పైన ఉండే పరంగు మాత్రం వేరే రంగులో ఉంటుంది. తెలుపురంగు అనేది అన్ని మైల్‌ స్టోన్స్‌కి కామన్‌గా ఉండటం అనేది అందరికి తెలిసిందే. కానీ తెలుపు రంగుకు కాంబినేషన్‌గా వచ్చే రంగు మాత్రమే మారుతుందని గమనించాలి. తెలుపుతో పాటు వేరే రంగు ఉండే ఇతర భాగం అర్థాలు వేరేగా ఉంటాయి.

మీరు ఉన్న ప్రదేశంలో మైలురాయి ఎల్లో కలర్‌ ఉన్నట్లయితే మీరు నేషనల్‌ హైవే మీద ఉన్నారని అర్థం. అదే గ్రీన్‌ కలర్‌ ఉన్న రాయి ఉంటే మీరు స్టేట్‌ హైవే మీద ఉన్నారని గుర్తించుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఒకవేళ మైలు రాయి బ్లాక్‌, బ్లూ లేదా వైట్‌ కలర్‌లో ఉన్నట్లయితే మీరు సిటీ లేదా డిస్ట్రిక్‌లోకి ఎంటర్‌ అయ్యారని అర్థం చేసుకోవాలి. అలాగే ఆ రోడ్లను కేవలం ఆ సిటీ పర్యవేక్షిస్తుందని గర్తించుకోవాలి. ఒకవేళ మైలురాయి ఎరుపు రంగులో ఉంటే మీరు రూరల్‌ రోడ్డు గుండా ప్రయాణిస్తున్నారని అర్థం. ఈ రోడ్లు ప్రధాన్‌ మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన కిందకు వస్తుంది. ఇవి రహదారుల వెంట ఉండే మైలు రాయి రంగుల అర్థం.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us