చింతకాయలోని పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. విత్తనాల సారం రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే చింతపండు పులుసు శరీర బరువు తగ్గడానికి, కొవ్వు కాలేయ వ్యాధిని రివర్స్ చేయడానికి సహాయపడుతుంది. ఇవే కాకుండా చింతకాయతో అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. అందులో చింతకాయ నువ్వుల పచ్చడి ఒకటి. మరీ అది ఎలా చేయాలో తెలుసుకుందామా..
చింతకాయలు – 10
వేయించిన నువ్వులు – 100 గ్రాములు
పచ్చి మిర్చి – 10
ఉప్పు – తగినంత
మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను
ఆవాలు – ఒక టీ స్పూను
జీలకర్ర – ఒక టీ స్పూను
మెంతులు – పావు టీ స్పూను
పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను
నూనె – 2 టేబుల్ స్పూన్లు
పసుపు – తగినంత
ముందుగా చింతకాయను శుభ్రంగా కడిగి.. తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని పప్పు గుత్తితో మెత్తగా అయ్యేలా చేసి.. గుజ్జును వడకట్టుకోవాలి. ఇక స్టౌమీద మరో బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణాలిలో మరింత నూనె వేసి కాగాక.. సెనగ ప్పపు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించి పక్కనపెట్టుకోవాలి. ఇవన్ని చల్లారక మిక్సీలో వేసి పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు జతచేసి మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత వెయించిన నువ్వులను కూడా కలిపి మరోసారి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి. చివరగా చింతకాయ గుజ్జును కలిపి మరోసారి మిక్సీ పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇక దీనిని పోపు పెట్టేస్తే సరి.
Also Read:
బరువు తగ్గాడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే ప్రయోజనాలెన్నో…
డిప్రెషన్‌కు గురవుతున్నారా ?.. అయితే మీరు డేంజర్లో ఉన్నట్టే.. అధ్యాయనాల్లో బయటపడ్డ విషయాలు..