1 / 5
Snakes Village: ఈరోజు మహాశివరాత్రి. శివ భక్తులకు ఈ రోజు ప్రత్యేకం. మనం శివున్ని తలచుకున్న వెంటనే చేతిలో త్రిశూలం, మెడకు పాము చుట్టుకున్న చిత్రం కనిపిస్తుంటుంది. ఇక పాముల విషయానికొస్తే.. పాములంటే ప్రజల్లో చాలా భయం ఉంటుంది. కానీ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో షెట్పాల్ అనే గ్రామం ఉంది. ఇక్కడ గ్రామంలో మనుషులు ఉన్నట్లు రకరకాల పాములు ఉంటాయి. ఇక్కడ అందరి కుటుంబంలో పాములు ముఖ్యమైనవి. ఈ గ్రామంలో నాగుపాములతో సహా అనేక రకాల పాములు ఉన్నాయి. ఈ గ్రామంలో పిల్లలు పాములతో ఆడుకుంటారు.