Madhya pradesh: ఒక వ్యక్తికి గత మంగళవారం సాయంకాలం సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో కంగారుపడిన ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించిన వైద్యులు.. బుధవారం ఉదయం పేషెంట్ చనిపోయినట్లు నిర్థారించారు. దీంతో కుటుంబ సభ్యుల తీవ్ర విషాదంలో మునిగిపోయారు. డెడ్‌బాడీని ఇంటికి తీసుకెళ్లి.. అంత్యక్రియుల కోసం పనులు ప్రారంభించారు. అయితే స్మశానానికి తీసుకెళ్తున్న సమయంలో.. చనిపోయాడని నిర్ధారించిన వ్యక్తి పాడెపై నుంచి ఒక్కసారిగా లేచాడు. దీంతో అక్కడున్న వాళ్లందరూ కంగుతిన్నారు. వెంటనే తేరుకున్న అతడి కొడుకు నీరు పట్టిస్తే తాగాడు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్‌కు వెళ్లేలోపు ఈసారి అతను నిజంగానే తనువు చాలించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలోని ధార్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. మృతుడు సంతోష్ 52 ఏళ్ల సంతోష్‌గా తెలిసింది. కాగా మొదట చికిత్స అందించిన ఆస్పత్రిపై మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read: Crime: బిడ్డకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక.. పోలీసుల అదుపులో 12 ఏళ్ల బాలుడు