కరకరలాడుతూ రుచిగా ఉండే ఆలూ చిప్స్‌ను లొట్టలేసుకుంటూ మరీ తింటుంటారు. అది పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు అంతా లాగించేస్తారు. ఫ్యామిలీ పార్టీ అయినా.. ఆఫీసు పార్టీ అయినా చిప్స్ ఉండాల్సందే. అంతేందుకు జర్నీ సమయంలో, క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు లేదా సినిమా చూస్తున్నప్పుడు కూడా చిప్స్ తినడానికి ఇష్టపడతారు. ఈ రోజు కొంతమంది పిల్లలకు, మ్యాగీ మాదిరిగా, చిప్స్ కూడా రోజువారీ అవసరంలో భాగమయ్యాయి. ప్యాక్డ్ చిప్స్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహార ఉత్పత్తులలో ఒకటి. ఈరోజు, మీరు ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే.. మీకు ముందుగా కనిపించే ఏ షాపులోనైనా చిప్స్ ప్యాకెట్స్ వేలాడదీసి కనిపిస్తాయి.
అయితే.. చిప్స్ తినే సమయంలో వాటిపై జిగ్‌జాగ్ డిజైన్‌లో లైన్‌లు, కొన్ని గీతలను మీరు ఎప్పుడైన గమనించారా..? గమనించినా అవి ఎందుకున్నాయనే ఆలోచన మీకు వచ్చి ఉంటుంది. చిప్స్‌పై ఉండే లైన్లను చూసి చాలా మంది ఈ లైన్లు డిజైన్ కోసం అని అనుకుంటారు. మీకూ అలాగే మీరు కూడా ఆలానే అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఈ గీతల వెనుక పెద్ద లాజిక్ ఉంది. మ్యాజిక్ ఉంది. అంతెందుకు ఓ బిజినెస్ సీక్రెట్ కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం ఆ లైన్స్ వెనుక ఉన్న రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
అయితే నేటికీ అలాంటి చిప్స్ ఉన్నాయి. కానీ అవి కేవలం సాల్ట్ చిప్స్ మాత్రమే. వాటిపై ఎలాంటి గీతలు కనిపించవు. కానీ వాటి రుచి తినడంలో కొంచెం చప్పగా, ఉప్పగా ఉంటాయి. చిప్స్‌పై జిగ్-జాగ్ లైన్‌లు తయారు చేయడానికి కారణం డిజైన్ కాదు. దీనికి కారణం చిప్స్ రుచిని పెంచేందుకు. నిజానికి, బంగాళదుంప చిప్స్ 1990 వరకు దేశీయంగా తయారు చేయబడ్డాయి. అప్పుడు చిప్స్‌పై అలాంటి లైన్ లేవు. అప్పట్లో అవి చాలా ప్లేయిన్‌గా ఉండేవి. అయితే ఎప్పుడైతే చిప్స్ తయారీ మార్కెట్లోకి ఎంఎన్‌సీ కంపెనీలు వచ్చాయో అప్పటి నుంచి పరిశ్రమ మొత్తం మారిపోయింది. కుటీర పరిశ్రమ కాస్తా భారీ ఇండస్ట్రీగా రూపాంతం చెందింది. అంతే కాదు అప్పటి వరకు ప్లెయిన్ చిప్స్ కాస్తా మసాల, స్పైసీ, మిర్చీ చిప్స్‌గా మారిపోయాయి. ఈ గీతలకు.. ఈ మసాలాకు ఏం సంబంధం అని ఆలోచిస్తున్నారా.. అయితే చదవండి..
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం..