Magic Rice: కొత్త రకం బియ్యాన్ని పండించిన కరీంనగర్ రైతు.. వాటిని అసలు ఉడికించకుండానే తినేయోచ్చంటా..

బియ్యాన్ని ఉడికించకుండా తినడం ఏంటీ అని ఆలోచిస్తున్నారా ? నిజమేనండోయ్.. వాటిని ఉడికించకుండానే తినోచ్చు. ఆ బియ్యాన్ని ఏ దేశంలో పండించారు అనుకుంటున్నారా ?

Magic Rice: కొత్త రకం బియ్యాన్ని పండించిన కరీంనగర్ రైతు.. వాటిని అసలు ఉడికించకుండానే తినేయోచ్చంటా..

Updated on: Jan 07, 2021 | 9:41 PM

బియ్యాన్ని ఉడికించకుండా తినడం ఏంటీ అని ఆలోచిస్తున్నారా ? నిజమేనండోయ్.. వాటిని ఉడికించకుండానే తినోచ్చు. ఆ బియ్యాన్ని ఏ దేశంలో పండించారు అనుకుంటున్నారా ? ఎక్కడో కాదండోయ్.. తెలంగాణలోని కరీంనగర్ రైతు పండించాడు ఈ కొత్త రకం బియ్యాన్ని. వాటినే ‘మ్యాజిక్ రైస్’ అని పిలుస్తారు. వీటికే మరోక పేరు ‘బోకా సౌల్’ లేదా ‘బోకా చావల్’ అని కూడా అంటారు.

గతంలో అస్సాం రాష్ట్రంలో ఈ మ్యాజిక్ రైస్ పండించేవాళ్లు. పూర్వం 17వ శతాబ్దంలో మొఘల్ సైనికులతో పోరాటానికి ముందు అస్సోం సైనికులు ఈ బియ్యాన్నే ఆహారంగా తీసుకునేవారంట. వాటిని వండాల్సిన పనిలేకుండా వాటిలో కాసిన్నీ నీళ్లు కలుపుకోని తీనేవారంట. అప్పటి నుంచి అస్సాం ప్రజలు దీన్ని సాంప్రదాయక ఆహారంగా తినడం మొదలుపెట్టారు. సాధారణంగా మనం ఇంట్లో వాడే బియ్యాన్ని ఉడికిస్తేనే అన్నం తయారు అవుతోంది. కానీ ఈ మ్యాజిక్ రైస్ అలా కాదంట. వీటిని ప్రత్యేకంగా ఉడికించాల్సిన అవసరం లేదు. వీటిని తినడానికి ఒక గంట ముందు చల్లని నీటిలో నానబెడితే చాలు.. ఉడికించిన అన్నంలా తయారవుతుంది. ఇవి చూసేందుకు ఉప్పుడు బియ్యంలా ఉబ్బి ఉంటాయి. ఈ అన్నంలో పెరుగు వేసుకుని అరటి పండుల లేదా బెల్లం నుంజుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. తాజాగా ఈ మ్యాజిక్ బియ్యాన్ని కరీంనగర్‏కు ఓ రైతు పండించాడు. వీటిపై వీటిపై ఎలాంటి రసాయనాలు, పురుగులు మందులు కూడా చల్లకుండా పండిస్తారట. ఈ మ్యాజిక్ రైస్ కేవలం అస్సాం దిగువ ప్రాంతాలైన నల్బారీ, బర్పెటా, గోల్పారా, కమ్రుప్, దర్రంగ్, దుబ్రీ, చిరంగ్, కోక్రఝార్, బక్సా ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది. జూన్ నుంచి డిసెంబరు నెలల్లో వీటిని ఎక్కువగా పండిస్తారు. పైగా వీటిపై ఎలాంటి రసాయనాలు, పురుగులు మందులు కూడా చల్లరు. పూర్తిగా సేంద్రీయ ఎరువులనే ఉపయోగితస్తారు. ఈ పంటకు ఉన్న ప్రత్యేకత తెలుసుకున్న కేంద్రం గతేడాది జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ కేటాయించడం గమనార్హం. ఈ బియ్యాన్ని పండించే ప్రాంతంలో రకాన్ని బట్టి కిలో రూ.60 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు.

Also Read: లడాఖ్ లో ‘లడాయి;, బియ్యమైతే కావాలి, చైనాకు ఇండియన్ రైస్ ఎగుమతి