AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారులో మద్యం తాగితే ఏమవుతుంది..? చట్టం ఏం చెప్తుందో మీరు తెలుసుకోవాల్సిందే..

కారు నాది.. డబ్బులు నావి.. నేను ఎక్కడ కూర్చుని తాగితే మీకెందుకు? అని అనుకుంటున్నారా? ఆ ఒక్క పొరపాటే మిమ్మల్ని ఏకంగా జైలు పాలు చేయొచ్చు. మీ సొంత కారులో కూర్చుని మద్యం సేవించడం కూడా తీవ్రమైన నేరమేనా? పార్కింగ్‌లో తాగినా పోలీసులు అరెస్ట్ చేస్తారా? చట్టం ఏం చెప్తుంది? అనే విషయాలు తెలుసుకుందాం..

కారులో మద్యం తాగితే ఏమవుతుంది..? చట్టం ఏం చెప్తుందో మీరు తెలుసుకోవాల్సిందే..
Is Drinking Inside Your Own Car Illegal
Krishna S
|

Updated on: Jul 21, 2026 | 3:42 PM

Share

వీకెండ్ వచ్చిందంటే చాలు.. చాలామంది స్నేహితులతో కలిసి కారులో లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం, మార్గమధ్యంలో రోడ్డు పక్కన కారు నిలిపి లేదా డ్రైవింగ్ చేస్తూ మద్యం సేవించడం సాధారణంగా చూస్తుంటాం. కారు అనేది తమ సొంత ఆస్తి అని, అందులో కూర్చుని తాగితే తప్పేంటి అని చాలామంది భావిస్తుంటారు. కానీ పబ్లిక్ ప్లేస్‌లో కారు లోపల కూర్చుని మద్యం తాగడం వల్ల మీరూ నేరుగా జైలుకు వెళ్లొచ్చు. దేశంలోని మోటారు వాహనాల చట్టం, అబ్కారీ చట్టాల ప్రకారం.. ప్రయాణంలో ఉన్న కారులో లేదా పబ్లిక్ ప్లేస్‌లో ఆపి ఉన్న కారులో మద్యం సేవించడం తీవ్రమైన నేరం. కారు నడిపే డ్రైవర్ మాత్రమే కాదు, కారులో కూర్చున్న మిగతా ప్రయాణికులు కూడా పబ్లిక్ ప్లేస్‌లో కారులో మద్యం సేవించడానికి వీల్లేదు.

కారు విషయంలో చట్టం ఏం చెప్తోంది?

చాలామందికి ఉండే ప్రధాన సందేహం.. ‘‘కారు మా సొంత ఇంటి కాంపౌండ్‌లో ఉంటే తాగొచ్చా?’’ అని. మీ కారు మీ సొంత ఇంటి పరిధిలో లేదా మీ సొంత ప్రైవేట్ గ్యారేజీలో ఉంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ కిందకు వస్తుంది. అటువంటి ప్రదేశాల్లో ఉన్న కారులో మద్యం సేవిస్తే పోలీసులకు నేరుగా జోక్యం చేసుకునే అధికారం ఉండదు.

అపార్ట్‌మెంట్, సొసైటీ పార్కింగ్‌లో జాగ్రత్త..

మీరు అపార్ట్‌మెంట్ లేదా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ సొసైటీ కామన్ పార్కింగ్‌లో కారు నిలిపి అందులో తాగుతుంటే మాత్రం ప్రమాదంలో పడ్డట్లే. సొసైటీ పార్కింగ్ ప్రదేశాలను చట్టబద్ధంగా కామన్, పబ్లిక్ స్పేస్‌గానే పరిగణిస్తారు. అక్కడ కారులో కూర్చుని మద్యం సేవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించినా, లేదా బయటకు కనిపిస్తూ ప్రవర్తించినా.. పొరుగువారు ఫిర్యాదు చేస్తే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

సురక్షితంగా ఉండటానికి పాటించాల్సిన నిబంధనలు..

హద్దు దాటితే: కారు మీ సొంత ఇంటిని దాటి రోడ్డుపైకి వచ్చిందంటే, అది వెంటనే కఠినమైన చట్టాల పరిధిలోకి వస్తుంది.

పబ్లిక్ ప్లేస్‌లో నో డ్రింకింగ్: పబ్లిక్ రోడ్లు, ఓపెన్ పార్కింగ్‌లలో కార్లలో కూర్చుని మద్యం సేవించడం లేదా ధూమపానం చేయడం ముమ్మాటికీ నేరమే.

మీ సరదా ఎవరికీ ఇబ్బంది కాకూడదు, అలాగే చట్టపరమైన చిక్కుల్లో మిమ్మల్ని నెట్టకూడదు. కారు మీదే అయినా పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నప్పుడు మద్యం సేవించకపోవడమే మీకూ, మీ కుటుంబానికి మంచిది.

Follow Us