Prison Life: హై-ప్రొఫైల్ నిందితులకు జైలు లోపల ఎంత పేమెంట్ ఇస్తారో తెలుసా?

జైలు అంటే కేవలం చీకటి గదులు, ఇనుప ఊచలు మాత్రమే కాదు.. అక్కడ ఖైదీల కోసం ఒక ప్రత్యేకమైన ఉపాధి ప్రపంచం ఉంటుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న వారు ఖాళీగా ఉండకుండా, ఏదో ఒక పని చేస్తూ నైపుణ్యాన్ని పెంచుకోవడమే కాకుండా, రోజువారీ కూలీని కూడా సంపాదిస్తారు. వంట చేయడం నుండి అగరుబత్తుల తయారీ వరకు ఖైదీలు చేసే ఆ విభిన్న పనులు, వారికి లభించే ఆదాయం ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

Prison Life: హై-ప్రొఫైల్ నిందితులకు జైలు లోపల ఎంత పేమెంట్ ఇస్తారో తెలుసా?
Prison Labor Inmate Employment

Updated on: Jan 15, 2026 | 9:23 PM

జైలులో ఉంటే కూడా జీతం ఇస్తారా? అవును, మీరు విన్నది నిజమే! దోషులుగా తేలిన వారు జైలులో ఉంటూ ప్రభుత్వానికి తమ సేవలను అందిస్తారు. అందుకోసం ప్రభుత్వం వారికి నిర్ణీత వేతనాన్ని చెల్లిస్తుంది. చదువుకున్న వారికి ఒక రకమైన పని, నైపుణ్యం ఉన్నవారికి మరో రకమైన పని కేటాయిస్తారు. అసలు జైలు గోడల మధ్య ఖైదీలు ఎలా సంపాదిస్తారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే!

జైలు నిర్వహణలో ఖైదీలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారు. ప్రధానంగా జైలు వంటగదిలో ఖైదీలందరికీ భోజనం వండటం, జైలు ఆవరణను శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం ఇస్త్రీ చేయడం వంటి పనులు చేస్తారు. వీటితో పాటు ఉద్యానవన పనులు మరియు వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారికి జైలు తోటల్లో కూరగాయలు, పండ్లు పండించే అవకాశం ఇస్తారు. భవనాల మరమ్మత్తులు, పెయింటింగ్ వంటి పనుల్లో కూడా ఖైదీలను ఉపయోగిస్తారు.

అంతేకాకుండా, జైలు లోపల చిన్న తరహా పరిశ్రమలు నడుస్తాయి. ఇక్కడ ఖైదీలు కొవ్వొత్తులు, అగరుబత్తులు, బెడ్‌షీట్లు, టవల్స్, సబ్బులు మ్యాట్లను తయారు చేస్తారు. నైపుణ్యం ఉన్నవారు వడ్రంగం (చెక్క పని) కూడా చేస్తారు. చదువుకున్న ఖైదీలకు లైబ్రరీ నిర్వహణ, ఆఫీసు రికార్డుల నమోదు వంటి పనులను కేటాయిస్తారు. కొంతమంది శిక్షణ పొందిన ఖైదీలు హెల్త్ సెంటర్లలో సహాయకులుగా కూడా పనిచేస్తారు.

జీతం ఎలా ఇస్తారు? ఖైదీలకు వారి నైపుణ్యం పనితీరు ఆధారంగా రోజువారీ కూలీ చెల్లిస్తారు. నిరక్షరాస్యులకు అంటే ఎటువంటి నైపుణ్యం లేని వారికి రోజుకు రూ. 35 ఇస్తారు. కొంచెం పని తెలిసిన వారికి (అర్ధ నిరక్షరాస్యులు లేదా సెమీ స్కిల్డ్) రోజుకు రూ. 40 చెల్లిస్తారు. అదే మంచి నైపుణ్యం ఉన్న స్కిల్డ్ ఖైదీలకు రోజుకు రూ. 45 వేతనంగా లభిస్తుంది. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదా హై-ప్రొఫైల్ నిందితులకు ఈ వేతనం రూ. 540 వరకు కూడా ఉండవచ్చు.

గమనిక: ఈ కథనంలో అందించిన విషయాలు కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది కేవలం సమాచారం మాత్రమే, దీనికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు.