మీ రైలు ప్రయాణం ఏదైనా అనుకోని కారణం చేత రద్దయిందా.? టికెట్‌ను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా.? అయితే ఖంగారు పడకండి.. మీ టికెట్‌ను వేరే వ్యక్తికి బదిలీ చేయవచ్చు.. అంటే మీ ట్రైన్ టికెట్‌పై వేరే వ్యక్తులు ప్రయాణించవచ్చు. ఈ రూల్ పాతదే అయినప్పటికీ.. చాలామందికి ఈ విషయం తెలియదు. మరి అదేంటో తెలుసుకుందాం..
ఇప్పటివరకు ఎవరైనా కూడా.. వారి రైలు ప్రయాణం అనివార్య కారణల వల్ల రద్దయితే.. వారు తమ రిజర్వేషన్ టికెట్‌ను క్యాన్సిల్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే.. ఇలా చేయడం తప్ప మరే ప్రత్యామ్నాయం లేదు. అయితే మీ ప్రయాణం ఒకవేళ క్యాన్సిల్ అయితే.. ఆ రిజర్వేషన్ టికెట్‌ను రద్దు చేయకుండా వేరే వ్యక్తులకు బదిలీ చేయవచ్చు. మీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, సిస్టర్స్ లేదా కొడుకు, కూతురు, భార్య.. ఇలా కుటుంబంలోని ఎవరికైనా మీ రిజర్వేషన్ టికెట్‌ను బదిలీ చేసుకోవచ్చు.
దీని కోసం ట్రైన్ డిపార్చర్ అయ్యే 24 గంటల ముందు ఎవరికి ఆ టికెట్ బదిలీ చేస్తున్నారో.. ఆ వ్యక్తి పేరుతో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి రైలు డిపార్చర్‌కు 24 గంటల ముందు సమర్పించాల్సి ఉండగా.. పెళ్లికి వెళ్తున్న ప్రయాణీకులు ట్రైన్ బయల్దేరే 48 గంటల ముందు సమర్పించాలి. ఈ దరఖాస్తును ఆన్‌లైన్ లేదా రిజర్వేషన్ కార్యాలయం ద్వారా కూడా ఇవ్వొచ్చు. ఒకవేళ రిజర్వేషన్ కౌంటర్ ద్వారా ఇస్తున్నట్లైతే.. దరఖాస్తును నింపి.. టికెట్ ప్రింట్‌తో పాటు బదిలీ చేసేవారి ఐడీ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అయితే రైలు టికెట్ బదిలీ అనేది ఒకసారి మాత్రమే చేయొచ్చు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Source: TimesOfIndia