షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోసం టెక్నికల్ బ్రాంచ్ (నావల్ కన్స్రక్టర్) కోర్సులో ఇండియన్ నేవి దరఖాస్తులు కోరుతుంది. ఈ కోర్సులను జూన్ 2021లో కేరళలోని ఇండియన్ నావల్ అకాడమీ (INA) ఎజిమలాలో ప్రారంభం కానున్నాయి.
షార్ట్ సర్వీస్ కమిషన్ 4 సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు పొడగించారు. అభ్యర్థులు సేవా ఆవసరాలు, పనితీరు, పోస్టుల ఖాళీల వివరాలు, మెడికల్ ఎలిజిబిలిటి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించింది. ఈ కోర్సులకు సంబంధించిన ఇంటర్వ్యూలు భోపాల్, బెంగళూరు, విశాఖపట్నం మరియు కోల్ కత్తలలో జరుగుతాయి. వీటి కోసం 800 మంది అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫిబ్రవరి 18 చివరితేదీ. కాగా వచ్చే నెల (మార్చి )21 నుంచి ప్రారంభం కానున్నాయి.
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు SSC ఇంటర్వ్యూ కోసం ఎంపికైన అభ్యర్థులకు ఈ విషయాన్ని వారి ఇ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ఎంపిక ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులు తమ ఇ-మెయిల్/ మొబైల్ నంబర్ మార్చవద్దని సూచించారు నేవీ తెలిపింది. రెండు దశల పరీక్షలతోపాటు కూడిన ఐదు రోజుల్లో ఎస్‌ఎస్‌బి ఇంటర్వ్యూ జరుగుతుంది. మొదటి దశలో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ మరియు గ్రూప్ డిస్కషన్ టెస్ట్‌లు జరుగుతాయి. రెండవ దశలో సైకాలజీకల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు ఉంటాయి. మొదటి దశలో విఫలమైన అభ్యర్థులను రెండవ దశ పరీక్షలో ఎంపిక చేయడానికి వీలు ఉండదని నోటిఫికేషన్లో వెల్లడించింది.
Also Read: Indian Navy: ఇండియన్ నేవీలోకి బ్రహ్మోస్ క్షిపణలు.. రక్షణ శాఖకు నేవీ ప్రతిపాదనలు.