Business News: మీరు ఇన్‏కమ్ ట్యాక్స్ కడుతున్నారా ? అయితే మీ ఐటీఆర్‏కు ఆధార్ నంబర్‏ను లింక్ చేయండిలా..

|

Jan 20, 2021 | 3:19 PM

ఇన్‏కమ్ ట్యాక్స్ కట్టేవారు తమ ఐటీఆర్‏కు కచ్చితంగా ఆధార్ నెంబర్‏ను లింక్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ లేకుండా ఐటీఆర్ దాఖలు

Business News: మీరు ఇన్‏కమ్ ట్యాక్స్ కడుతున్నారా ? అయితే మీ ఐటీఆర్‏కు ఆధార్ నంబర్‏ను లింక్ చేయండిలా..
Follow us on

ఇన్‏కమ్ ట్యాక్స్ కట్టేవారు తమ ఐటీఆర్‏కు కచ్చితంగా ఆధార్ నెంబర్‏ను లింక్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ లేకుండా ఐటీఆర్ దాఖలు చేయడం అసలు కుదరదు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇన్‏కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు అందులో కచ్చితంగా ఆధార్ నెంబర్‍‏ను జతచేయాల్సి ఉంటుంది. అలాగే పన్ను చెల్లించేవారు కూడా ఆధార్ నంబరును పాన్ కార్డుకు లింక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ లింక్ అయినవారు మాత్రమే ఐటీఆర్ దాఖలు చేయడానికి వీలు ఉంటుంది. ఇక చాలా మందికి తమ ఐటీఆర్‏కు ఆధార్ నంబర్ లింక్ చేయడం తెలియదు. ఆధార్ నంబర్ లింక్ చేయడం ఇప్పుడు చాలా సులువు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో అంతా ఆన్‏లైన్‏లోనే చేసుకునే సదుపాయం ఉంది. ఇందుకోసం ముందుగా ఇన్‏కమ్ ట్యాక్స్ వెబ్‏సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది.

ఆ తర్వాత వెబ్‏సైట్‏లోని ప్రొఫైల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అందులో ఉన్న ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి.. ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం లింక్ నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు పలు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఉన్న మూడో ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. వెంటనే ఒక ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. దీంతో ఆధార్ నంబర్, ఐటీఆర్ లింక్ అవుతాయి.

ఐటీఆర్ దాఖలు చేసేవారు తెలుసుకోవాల్సిన విషయాలు..
ఐటీఆర్ దాఖలు చేసేవారు కచ్చితంగా ఆధార్ నంబరును లింక్ చేయాలి. 2019 ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అంతేకాకుండా ఆధార్ నంబర్ చెప్పకుండా ఇన్‏కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి సాధ్యంకాదు. ఇందుకు ఆధార్ నంబర్ ఉండాల్సిందే. అలాగే 60 ఏళ్ళ లోపు వయసు కలిగినవారు సంవత్సరానికి రూ.2.5 లక్షలకు పైన ఆదాయం కలిగి ఉంటే వారు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

Also Read: ఆధార్ కార్డుకు పాన్ కార్డు అనుసంధానం ఎలా చేయాలి.? 2 నిమిషాల్లో లింక్ చేసుకొండి ఇలా..

ITR Filing last Date 2019-20: ఇన్‌కమ్ ట్యాక్స్ రిట్నర్ దాఖలు చేశారా? చివరి తేది ఎప్పుడంటే.