Cockroach Control Tips: బొద్దింకలన్నింటిని శాశ్వతంగా తరిమికొట్టే సింపుల్ చిట్కాలు.. కేవలం రూ.10లతో..

వంటగదిలో పెరుగుతున్న బొద్దింకల వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా.. అయితే, ఈ రోజు మేం బొద్దింకలను చంపకుండా వంటగది నుంచి వాటిని దూరంగా తరిమికొట్టడానికి 4 చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం..

Cockroach Control Tips: బొద్దింకలన్నింటిని శాశ్వతంగా తరిమికొట్టే సింపుల్ చిట్కాలు.. కేవలం రూ.10లతో..
Cockroach

Updated on: Feb 14, 2023 | 9:42 AM

బొద్దింకలు.. ఈ పేరు వింటే పరుగులు పెట్టేవారి మనం చాలా సార్లు చూసి ఉంటాం. అవి ఇక్కడా.. అక్కడా అని కూదు ఎక్కడైనా కనిపిస్తుంటాయి. ప్రతి ఒక్కరు ఈ బొద్దికలతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అవి ఇళ్లల్లో మనం తినే ఆహార పదార్థాల మీదకి కూడా వచ్చేస్తూ ఉంటాయి. బొద్దింకల సమస్యతో ఇబ్బంది పడని ఇల్లు ఏదీ ఉండదు. ఈ బొద్దింకలు అందులో పడి ఆహారాన్ని పాడు చేస్తాయి. అదే సమయంలో, వాటిని చూస్తే, మీరు కూడా అసహ్యించుకుంటారు. వీరిని చంపేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా మళ్లీ అదే సంఖ్యలో దాడి చేయడం అతిపెద్ద సమస్య.

మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. మీ ఇంట్లో కూడా బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా..? అయితే వాటిని తరిమికొట్టడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా..? ఇప్పటికే కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చారా..? అయినా బొద్దింకలు పారిపోవడం లేదా..? అయితే తప్పకుండా ఇక్కడ ఉన్న కొన్ని మార్గాలని అనుసరించండి. వీటి వల్ల మీకు త్వరగా సొల్యూషన్ దొరుకుతుంది. పైగా అవి మళ్లీ మీ దగ్గరికి రావు. పైగా ఇంట్లో బొద్దింకలు ఉండడం ఎవరు ఇష్టపడతారు. ఎవరికి కూడా నచ్చదు.

వంటగది నుంచి బొద్దింకలను వదిలించుకోవడానికి చిట్కాలు

బగార ఆకు పొడిని ఉపయోగించండి

వంటగది నుంచి బొద్దింకలను వదిలించుకోవడానికి.. 2-3 ఎండిన బే ఆకులను తీసుకొని వాటి నుండి చక్కటి పొడిని తయారు చేయండి. దీని తరువాత, బొద్దింకలు ఎక్కువగా కదలికలు ఉన్న ప్రదేశాలలో ఆ పొడిని కొద్దికొద్దిగా ఉంచండి. బొద్దింకలు బే ఆకుల బలమైన వాసనను తట్టుకోలేవు, అక్కడ నుండి మైకంలోకి పడిపోతాయి. ఇంట్లో బొద్దింకలను వదిలించుకోవడానికి కిరోసిన్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక సీసాలో కిరోసిన్ నూనె నింపి, బొద్దింకలు కనిపించే ప్రదేశాలలో స్ప్రే చేయండి. దీంతో ఈ బొద్దింకలు మీ ఇంటి నుంచి పారిపోతాయి.

లవంగాల వాసనకు బొద్దింకలు అలర్జీ..

మీరు లవంగాలతో బొద్దింకలను కూడా తరిమికొట్టవచ్చు. ఇందుకోసం 10 లవంగాలు తీసుకుని అందులో వేపనూనె కలపాలి. ఆ తర్వాత ఆ ద్రావణాన్ని వంటగదిలో బొద్దింకలు ఉండే ప్రదేశాలపై చల్లాలి. ఈ పరిహారంతో, బొద్దింకలు మిమ్మల్ని వదిలి వంటగది నుంచి పారిపోతాయి. నిజానికి లవంగాల ఘాటు వాసనను బొద్దింకలు తట్టుకోలేవు.

వంట సోడా..

వంట సోడా కూడా బొద్దింకలను వంటగది నుంచి బయటకు తీయడానికి మంచి చిట్కా . కొంచెం బేకింగ్ సోడా తీసుకుని అందులో పంచదార కలపాలి. దీని తరువాత, మీరు బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రదేశంలో ఆ బేకింగ్ సోడాను ఉంచండి. ఈ రెమెడీతో బొద్దింకలు చిట్లినట్లు కనిపింవు.

Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం