Senior Citizens Helpline: ఇక వృద్ధులకు ఏ భయం అక్కర్లేదు.. ఒక్క ఫోన్ కాల్ చాలు.. సమస్యలు తీరిపోతాయి!

సీనియర్‌ సిటిజన్‌లు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ, ఇప్పటికీ ఎన్నో అవసరాలు వారికి తీరకుండానే ఉండిపోతున్నాయి.

Senior Citizens Helpline: ఇక వృద్ధులకు ఏ భయం అక్కర్లేదు.. ఒక్క ఫోన్ కాల్ చాలు.. సమస్యలు తీరిపోతాయి!
Senior Citizens Helpline

Updated on: Dec 02, 2021 | 8:55 PM

Senior Citizens Helpline: సీనియర్‌ సిటిజన్‌లు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ, ఇప్పటికీ ఎన్నో అవసరాలు వారికి తీరకుండానే ఉండిపోతున్నాయి. ఈ వయస్సు ప్రజలు వివిధ మానసిక, భావోద్వేగ, ఆర్థిక, చట్టపరమైన మరియు శారీరక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో, బయటకు వెళ్లడం సాధ్యం కాదు. ఆ సమయంలో సీనియర్ సిటిజన్లకు ఈ సమస్య పెరిగింది. పీఐబీ(PIB) నివేదిక ప్రకారం, భారతదేశంలో 2050 నాటికి వృద్ధుల జనాభాలో దాదాపు 20 శాతం అంటే 300 మిలియన్లకు పైగా సీనియర్ సిటిజన్లు ఉంటారని అంచనా.

ఎల్డర్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభం..

వయోజనులకు వచ్చే ఇబ్బందుల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. ఉదాహరణకు పెన్షనర్లు ఒక సంవత్సరంలో ఒకసారి వారి జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఈపనిని సీనియర్ సిటిజన్లు స్వయంగా చేయడం అసాధ్యం. అటువంటి పరిస్థితిలో, సీనియర్ సిటిజన్లకు అనేక సౌకర్యాలు కల్పించారు. వారు తమ ఇంటి నుంచి ఈ పనిని చేసుకునే విధంగా ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే ఇతర సమస్యల విషయంలోనూ అదేవిధంగా, దేశంలో వృద్ధులను ఆదుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం దేశంలోని మొట్టమొదటి పాన్-ఇండియా టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ – 14567 ప్రారంభించింది. దీని ద్వారా వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లవచ్చు. దీనిని ‘ఎల్డర్ లైన్’ అని కూడా పిలుస్తారు.

ఏదైనా సమస్య గురించి కాల్ చేయవచ్చు

టోల్ ఫ్రీ నంబర్ ద్వారా, వృద్ధులు పెన్షన్ సమస్యలు, న్యాయపరమైన సమస్యలపై ఉచిత సమాచారాన్ని పొందవచ్చు. అదనంగా, ఇది భావోద్వేగ మద్దతును అందిస్తుంది. దుర్వినియోగ కేసుల గురించి తెలుసుకుంటుంది. నిరాశ్రయులైన వృద్ధులకు భద్రత కల్పించడానికి ప్రయత్నిస్తుంది.

ప్రస్తుత కాలంలో ప్రతి దశలో ఏదో ఒక సమస్యను ఎదుర్కునే సీనియర్ సిటిజన్లు చాలా మంది ఉన్నారు. దానిని ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలియదు. అయితే ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు వారు 14567 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. దేశంలోని సీనియర్ సిటిజన్లు లేదా వారి శ్రేయోభిలాషులందరికీ వారి ఆందోళనలను పంచుకునేలా ఒక వేదికను అందించడమే ఈ ‘ఎల్డర్ లైన్’ ఉద్దేశ్యమని మీకు తెలియజేద్దాం.

టాటా ట్రస్ట్ ద్వారా..

ఎల్డర్ లైన్ టాటా ట్రస్ట్‌ ద్వారా ప్రారంభించారు. ఇది భారతదేశంలోని పురాతన దాతృత్వ ట్రస్ట్, ఇది 2017లో హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ సహాయంతో, అనేక నగరాల్లోని వృద్ధులకు సహాయం చేయడానికి తన భాగస్వామి విజయవాహిని ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించారు. అదనంగా, టాటా ట్రస్ట్‌లు, NSE ఫౌండేషన్, సాంకేతిక భాగస్వాములుగా, ఎల్డర్ లైన్ ఆపరేషన్‌లో మంత్రిత్వ శాఖకు సంయుక్తంగా మద్దతునిస్తున్నాయి.

17 రాష్ట్రాలు ఎల్డర్ లైన్‌ను తెరిచాయి

ఇప్పటివరకు, 17 రాష్ట్రాలు తమ తమ భౌగోళిక ప్రాంతాల కోసం ఎల్డర్ లైన్‌ను తెరిచాయి. ఇతర ప్రదేశాలలో దాన్ని తెరవడానికి ప్రక్రియ కొనసాగుతోంది. గత 4 నెలల్లో, 2 లక్షలకు పైగా కాల్‌లు కూడా అందాయి. దీనిద్వారా ఇప్పటికే 30,000 మందికి పైగా సీనియర్‌లు సేవలు అందించారు. పింఛను రాని వ్యక్తికి సంబంధించి ఎల్డర్‌లైన్‌ బృందానికి ఫోన్‌ చేసి సహకరించాలని కోరారు. దీంతో బృందం సంబంధిత పెన్షన్ అధికారిని సంప్రదించింది. పెన్షన్ వెంటనే సీనియర్ సిటిజన్ ఖాతాలో జమ అయింది.

ఇవి కూడా చదవండి:

Pregnancy Care: గర్భధారణ సమయంలో చురుకుగా ఉంటే.. ప్రసవ సమయంలో శక్తివంతంగా ఉంటారు.. ప్రసవవేదన తగ్గుతుంది!

Electricity Bill 2021: ఈ బిల్లుతో కరెంట్ చార్జీలు మీ జేబులు ఖాళీ చేస్తాయి.. అయినా ఫర్వాలేదు అంటున్న ప్రభుత్వం ఎందుకంటే..

Omicron: ఒమిక్రాన్ గురించి పూర్తిగా తెలిసేది అప్పుడే.. టేకిటీసీ పాలసీ ముప్పు తెస్తుంది..బ్రిటన్ శాస్త్రవేత్త హెచ్చరిక!