Happy Holi 2021: ఈ రంగుల హోలీకి అందమైన కోట్స్‏తో మీ ఆత్మీయులను విష్ చేయాండిలా..

|

Mar 29, 2021 | 8:09 AM

Holi 2021: హోలీ... రంగుల రంగేళి... చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా.. ఆనందంగా రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు.

Happy Holi 2021: ఈ రంగుల హోలీకి అందమైన కోట్స్‏తో మీ ఆత్మీయులను విష్ చేయాండిలా..
Holi 2021
Follow us on

Holi 2021: హోలీ… రంగుల రంగేళి… చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా.. ఆనందంగా రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. నూతన ప్రకృతికి స్వాగతం పలుకుతూ.. ఫాల్గుణ పూర్ణిమ నాడు హోలిని జరుపుకుంటారు. సతీ దేవిని కోల్పోయిన శివుడు ఒక గుహలో తప్పస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ తప్పస్సు నుంచి శివుడిని మేల్కోల్పడానికి పార్వతి దేవి రాగా.. ఆమెకు సహయంగా వచ్చిన మన్మథుడు.. పరమేశ్వరుడిపైకి మన్మథ బాణాన్ని విసురుతాడు. దాంతో వెంటనే తప్పస్సు నుంచి బయటకు వచ్చిన శివుడు తన మూడో కన్ను తెరచి.. మన్మథుడిని భష్మం చేస్తాడు. ఆ కామదహనమే.. హోలీ జరుపుకోవడానికి కారణమంటుంటారు.

గతేడాది కరోనా మహామ్మారి కారణంగా హోలీ సంబరాలకు పర్మిషన్ లేదు. కానీ ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనల మధ్య హోలీ వేడుకలను జరుపుకుంటున్నారు చాలామంది. ఇక దూరంగా ఉన్న తమ ఆత్మీయులకు హోలీ శుభాకాంక్షలు అందమైన కోట్స్ చెప్పాండిలా.. అందుకు మీ కోసం అందమైన కోట్స్ ఇక్కడ..

* వసంత గమనంలో వస్తుంది రంగుల హోలీ..
నింపుతుంది మీ జీవితాలలో ఆనందాల కేళీ..
హోలీ శుభాకాంక్షలు..

* అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందం..
అన్ని మతాలు కలిసి ఉంటేనే దేశానికి అందం…
హోలీ శుభాకాంక్షలు..

* సప్తవర్ణ శోభితమైన.. సలక్షణమైన పండుగ…
వసంత శోభతో పరిడవిల్లే.. నవనవోన్మేషమైన వేడుక..
రంగుల కేళి.. హోళీ పండుగ సందర్భంగా..
ఆత్మీయులైన మిత్రులందరికీ శుభాకాంక్షలు..

* హరివిల్లులోని రంగులన్నీ..
మురళీ నాదములోని మధువు..
కలిసి వచ్చి ఒక చోట చేరి హోలీ నాడు ఆనందింపచేయాలని కోరుతూ..
మీకు హోలీ శుభాకాంక్షలు..

* మీ జీవితాన్ని రంగులమయం చేసుకోవడం..
మీ చేతుల్లోనే ఉంది.. హోలీ శుభాకాంక్షలు..

* హోలీ రంగుల కేళీ..
మీ జీవితంలో నిండాలి రంగోలీ..
ఆరోగ్యం.. ఐశ్వర్యాలతో వర్థిల్లాలి!
హోలీ శుభాకాంక్షాలు.

* హోలీ రోజున ఒకరికొకరు చల్లుకొనేవి రంగులు కావు..
అనురాగ, అప్యాయతలు కలిసిన పన్నీటి రంగుల జల్లులు.
హోలీ శుభాకాంక్షాలు.

Holi

Holi 2

Also read:

Holi 2021: ఈ హోలీ రోజున మీ ఇంట్లోనే సులభంగా ఈ స్నాక్స్ తయారు చేసుకొండిలా.. మరింత రుచిగా..

Holi 2021: హోలీలో వాడే గులాల్ రంగు నుంచి మీ జుట్టును ఈ విధంగా కాపాడుకోండిలా..